వారణాసిలో బ్రహ్మోత్సవం!

maheshbabu
బ్రహ్మోత్సవం సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల సూపర్‌ హిట్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి అందమైన సినిమా తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడం, బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ శ్రీమంతుడు తర్వాత మహేష్‌ హీరోగా చేస్తోన్న సినిమా కావడం లాంటి విషయాలతో పాటు జనవరి 1న విడుదలైన టీజర్‌ కూడా ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా ఉండనుందని చెబుతోన్న పివిపి సంస్థ భారీ బడ్జెట్‌లో సినిమాను నిర్మిస్తోంది.

ఇప్పటికే 80శాతం పైనే షూటింగ్‌ పూర్తి చేసుకున్న సినిమా ప్రస్తుతం వారణాసిలో ఓ షెడ్యూల్‌ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్‌లో మహేష్‌, సమంతలతో పాటు ఇతర తారాగణం పాల్గొంటుండగా కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక మరికొద్ది రోజుల పాటు వారణాసి, ఢిల్లీ, డెహ్రడూన్‌ లాంటి నార్త్‌ ఇండియన్‌ ప్రాంతాల్లోనే బ్రహ్మోత్సవం షూటింగ్‌ జరగనుంది. ఈ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్‌ దాదాపుగా పూర్తవుతుందని తెలుస్తోంది. సమ్మర్‌ కానుకగా ఏప్రిల్‌  నెలాఖర్లో లేదా మేలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్‌ సరసన సమంత, కాజల్‌, ప్రణీత…ఇలా ముగ్గురు హీరోయిన్లు నటించడం విశేషంగా చెప్పుకోవచ్చు.