వారంతా తెలుగుబిడ్డలే: కవిత
హైదరాబాద్: హైదరాబాద్లో ఉన్నరవారంతా తెలుగు బిడ్డలేనని నిజామాబాద్ ఎంపి కవిత అన్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో భాగంఆ సిటీలోని గాంధీనర్లో ఆమె మాట్లాడారు. నగరంలో రియల్ ఎస్టేట్ 50 శాతం పెరిగిందన్నారు. మహిళల భద్రతకోసం షీటీమ్స్ ఏర్పాటుచేశామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్కు రూ.50 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు. ప్రస్తుతం పేదలకు ప్రభుత్వం డబుల్బెడ్రూమ్ ఇశ్లు మంజూరు చేస్తోందని కూడ తెలిపారు.