వాణిజ్య ఎగుమతులు 23.9 బిలియన్‌ డాలర్లు

B1
Exports

వాణిజ్య ఎగుమతులు 23.9 బిలియన్‌ డాలర్లు

న్యూఢిల్లీ, జనవరి 15: భారత వాణిజ్య ఎగుమతులు వరుసగా నాలుగోనెలలో కూడా పెరిగాయి. డిసెం బరు నెలలో 5.72శాతం పెరిగి 23.9 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. ఏడాది క్రితం ఇదేనెలలో 22.6 బిలియన్‌ డాలర్లు మాత్రమే ఎగుమతులు జరిగాయి. దిగుమతులపరంగా కూడా 0.46శాతం పెరిగాయి. 34.25 బిలియన్‌ డాలర్ల విలువైన దిగుమతులు జరిగాయి. దీనితో వాణిజ్యలోటు డిసెంబరునెలకు 10.36 బిలియన్‌ డాలర్లుగా నిలిచింది. ముడిచమురు దిగుమతులపరంగాచూస్తే 7.645 బిలియన్‌ డాలర్ల విలువైనవి జరిగాయి. గత ఏడాది ఇదేనెలలో 6.670 బిలియన్‌ డాలర్ల దిగు మతులు జరిగాయి. ఇక చమురేతర ఉత్పత్తులపరంగా దిగుమతులు 26.608 బిలియన్‌ డాలర్లుగా నిలిచాయి. గత ఏడాది 27,425 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే 2.98శాతం తగ్గి నట్లు అంచనా. ఏప్రిల్‌ డిసెంబరు మధ్యకాలంలోఎగుమతులు 0.75 శాతంవృద్ధి జరిగింది. 198.8 బిలియన్‌ డాలర్లుగా నిలిచాయి. దిగుమతుల పరంగాచూస్తే 7.42 శాతం దిగజారి 275.3 బిలియన్‌ డాలర్లకు చేరాయి. తొమ్మిది నెలల కాలానికిగాను వాణిజ్యలోటు 76.54 బిలియన్‌ డాలర్లుగా ఉంది. అదే గత ఏడాది తొమ్మిదినెలలకుగాను 100 బిలియన్‌ డాలర్లున్న సంగతి తెలిసిందే.