వాట్సాప్ నుంచి వీడియో కాలింగ్ షురూ!

వాట్సాప్ నుంచి వీడియో కాలింగ్ షురూ!
న్యూఢిల్లీ,నవంబరు 15: సోషల్ వెబ్సైట్ సంస్థ వాట్సాప్ తాజాగా వీడియోకాలింగ్ సేవలను తన యాప్‌పై ప్రారంభించేందుకు సిద్ధం అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా స్కైప్ తర్వాత అతిపెద్ద వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ ప్లాట్‌ఫామ్‌గా పనిచేస్తున్న వాట్సాప్ ఇకపై వీడియోకాలింగ్‌తో తన విని యోగదారులకు మరింతచేరువ అవుతోంది. ఇప్ప టికే స్కైప్, యాపిల్ ఫేస్‌టైమ్, గూగుల్ డ్యువో వంటివి వీడియోకాలింగ్ అందిస్తున్నాయి. వచ్చే కొద్దిరోజుల్లోనే సుమారు 100 కోట్లమంది వాట్సా ప్ వినియోగదారులకు వీడియోకాలింగ్ చేరువ అవుతుందని ప్రకటించింది. భారత్నుంచే ఈ సేవలు ప్రారంభిస్తున్నట్లు వాట్సాప్ప్రకటించింది. భారత్‌లోనే ఈ యాప్సేవలకు ఎక్కువమంది విని యోగదారులున్నారు.వాయిస్‌కాల్స్, వీడియోకాల్స్ కూడా మరింత శక్తివంతంగా అందించేందుకు కృషి చేస్తున్నట్లు బిజినెస్ హెడ్ నీరజ్ అరోరా వెల్లడిం చారు. నెట్వర్క్క్వాలిటీ ఆధారంగా వీడియో కూడా స్పష్టతకు సర్దుబాటు అవుతుందని ఆయనఅన్నా రు. టెక్స్ట్ వాయిస్ కాలింగ్ ఫీచర్లకు అదనంగా వీడియోకాల్స్ కూడా ఎన్‌క్రిప్ట్ అయిఎండ్టు ఎండ్ భద్రతఫీచర్లతో ఉంటాయని ఆయన అన్నారు.
కొత్త అప్డేట్తో వినియోగదారులు తమకు ఇష్టమైన లేదా వాయిస్ లేదా వీడియోకాల్‌ను ఎంచుకుని ఆకాల్తో కొనసాగవచ్చని ఆయననఅన్నారు. రాను న్న రోజుల్లో ఎంతమంది వినియోగదారులు పెరగ వచ్చన్న అంశంపై అరోరా స్పష్టత ఇవ్వలేదు. అయితే వీడియోకాలింగ్ ఫీచర్‌తో తమకస్టమర్బేస్ రెట్టింపు అవుతుందని ఆయన ధీమాగా ఉన్నారు. జూన్నెలలనే వాట్సాప్ తమకు పదికోట్లమందికి పైగా యూజర్లు ప్రతిరోజూ వినియోగిస్తున్నట్లు ప్రక టించింది. ఈ గణాంకాల ఆధారంగాచూస్తే భారత్ ఇతర దేశాలకంటే అతిఎక్కువ మంది వినియోదారు లున్న దేశంగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఫేస్బుక్ అధీనంలోని వాట్సాప్ డిఫాల్ట్ మెసేజింగ్ అప్లికేషన్లో భారత్, బ్రెజిల్లో విశేష సేవలంది స్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హైక్, వైబర్, లైన్లతో పోలిస్తే 160 మిలియన్ల మంది వాట్సాప్ వినియోగదారులున్నట్లు తేలింది. వీడియోకాలింగ్ ఫీచర్‌తో మైక్రోసాప్ట్ స్కైప్,యాపిల్ ఫేస్‌టైమ్ వంటి వాటికి గట్టిపోటీ ఇస్తుందని అంచనా. ఈ ఏడాది తొలినాళ్లలోనే గూగుల్ అల్లో మెసేజింగ్ యాప్‌ను వీడియోకాలింగ్యాప్ డ్యువోను విడు దల చేసింది. వాట్సాప్,ఫేస్బుక్ యాప్‌లు రెండూ భిన్నరకాలుగా పనిచేస్తాయని అరోరా వివరించారు. ఫేస్బుక్ జాబితా అయిన స్నేహితులకు కనెక్ట్ చేస్తుందని, వాట్సాప్ మీఫోన్లో ఉన్న కాంటాక్టు జాబితా ఆధారంగా ఎవ్వరికైనా కాలింగ్ చేసుకోవ చ్చని ఆయనఅన్నారు. బాట్స్ తరహాలో ఈ మెసెంజర్ కొత్త అన్వేషణలతో ముందుకు వస్తుంద న్నారు. వాట్సాప్పరంగా కొత్త కొత్త అన్వేషణలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయన్నారు.