వాట్సాప్‌లో యుపిఐ చెల్లింపులఫీచర్‌

WHATSAPP
WHATSAPP

ముంబయి: వాట్సాప్‌కు భారత్‌లో ఉన్న ప్రాచుర్యం దృష్ట్యా సంస్థ కొత్తగా వాట్సాప్‌కు అదనపు ఫీచర్లు జోడిస్తోంది. రోజురోజుకు దేశంలోపెరుగుతున్న చెల్లింపుల వ్యాలెట్‌సేవలకు ధీటుగా వాట్సాప్‌ తాజాగా యుపిఐ చెల్లింపుల ఫీచర్‌ను జో డిస్తోంది. నెలకు 200 మిలియన్‌ క్రియాశీలక వినియోగదారులు ఉన్నారంటే వాట్సాప్‌ తారస్థాయిలో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్లను జోడిస్తోంది. పెద్దనోట్ల రద్దు తర్వాత డిజిటల్‌ లావాదేవీలు ఊపందుకున్న నేపథ్యంలో ఈ ఏడాదిజూన్‌నాటికి కోటికిపైగా లావాదేవీలు జరుగుతాయని యుపిఐద్వారానే భారీసంఖ్యలో జరిగినట్లు జాతీయ చెల్లింపులసస్థ ఎన్‌పిసిఐ వెల్లడించింది. వీటితోపేమెంట్స్‌ఫీచర్‌పై వాట్సప్‌ కన్నేసింది. కొత్త బీటా వెర్షన్‌ 2.17.295లో వాట్సాప్‌ పేమెంట్స్‌ ఫీచర్‌ను తెచ్చినట్లు సమాచారం. వాట్సాప్‌ద్వారా త్వరలోనే డబ్బులు పంపించే అవకాశం వస్తోంది.యుపిఐ సౌకర్యం ద్వారా ఈ సౌలభ్యం త్వరలోనే అందుబాటులోనికి వస్తున్నది. ఇప్పటికే కొన్ని మొబైల్‌ మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌లు వీఛాట్‌, హైక్‌మెసెంజర్లు యుపిఐ ఆధారిత చెల్లింపు సేవలు అందిస్తున్నాయి. ప్రస్తుతానికిఆండ్రాయిడ్‌లో వాట్సాప్‌పేమెంట్స్‌ ప్రయోగాల దశలోనే ఉంది. ఈ ఫీచర్‌ వినియోగించుకోవాలంటే వాట్సాప్‌ పేమెంట్స్‌ అండ్‌ బ్యాంక్‌ టర్మ్స్‌ అండ్‌ప్రైవసీ పాలసీని అంగీకరించాల్సి ఉంటుంది. ఇప్పటికే వాట్సాప్‌ ఎన్‌పిసిఐతో చర్చిస్తోంది. కొన్ని బ్యాంకులు కూడాయుపిఐద్వారా వాట్సాప్‌లో లావాదేవీలునిర్వహించేందుకు ఆసక్తిచూపిస్తున్నాయి. యుపిఐ ఆధారిత నగదు లావాదేవీలతోపాటు మరో ఐదుఫీచర్లువాట్సాప్‌ తెస్తోంది. యూట్యూబ్‌ వీడియోలునేరుగా వీక్షించే అవకాశం, మెసేజ్‌రీకాల్‌ఫీచర్‌, లైవ్‌లొకేషన్‌ షేరింగ్‌, నంబరు మారినపుడు ఒకేసారి లిస్ట్‌లోనికాంటాక్టులు అందరికీ తెలియజేసే ఫీచర్‌, ఎడిట్‌ సెంట్‌ మెసేజెస్‌ వంటి ఫీచర్లు అందించేందుకు కసరత్తులు

చేస్తున్నది. ప్రస్తుతం ఇవన్నీచివరిదశలో ఉన్నాయి.