వాట్సాప్‌లో మరో కొంగొత్త ఫీచర్‌

WhatsApp
WhatsApp

ఇంటర్నెట్‌ డెస్క్‌: వాట్సాప్‌లో మరో కొంగొత్త అప్‌డేట్‌ రాబోతున్నట్లు సమాచారం. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ వినియోగదారులకు
ఇదివరకు వీడియో కాల్‌ సౌలభ్యం ఉన్న సంగతి తెలిసిందే, తాజాగా పిక్చర్‌-ఇన్‌-పిక్చర్‌ మోడ్‌ ఫీచర్‌ను అందుబాటులోకి
తెచ్చేందుకు యత్నాలు జరుగుతున్నాయి. బేటా వెర్షన్‌ 2.12.265లో ఈ ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ
వాట్సాప్‌ ఫీచర్‌కి సంబంధించిన కొన్ని స్క్రీన్‌ షాట్స్‌ ట్విట్టర్‌ ద్వారా ఒకరితో వీడియో కాల్‌ ద్వారా మాట్లాడుతున్నప్పుడు
మరోకరితో చాట్‌ చేయవచ్చు. వాట్సాప్‌లోనే యూట్యూబ్‌ వీక్షించేలా కొంగొత్త అప్‌డేట్‌ రాబోతోందని వార్తలు వచ్చాయి.