వాట్సాప్‌లో గ్రూప్ వీడియో కాలింగ్‌

whatsapp
whatsapp

వాట్సాప్ లో వీడియో కాల్ ను ఒకేసారి ఒకరికి మించి గ్రూపు పరిధిలో చేసుకునే అవకాశం వస్తోంది. త్వరలోనే గ్రూప్ వాయిస్, వీడియో కాల్ సేవలను ఆరంభించనున్నట్టు ఫేస్ బుక్ (వాట్సాప్ యజమాని ఫేస్ బుక్ అని తెలిసిందే) సీఈవో మార్క్ జుకర్ బెర్గ్ ప్రకటించారు. ఫేస్ బుక్ వార్షిక ‘ఎఫ్8 డెవలపర్ల సమావేశం’లో ఆయన ఈ ప్రకటన చేయడం విశేషం. ‘‘వాట్సాప్ లో వాయిస్, వీడియో కాలింగ్ కు చాలా ఆదరణ ఉంది. రానున్న నెలల్లో గ్రూప్ కాలింగ్ కూడా అందుబాటులోకి రానుందనే సమాచారాన్ని పంచుకునేందుకు ఉత్సాహంగా ఉంది. వాట్సాప్ లో స్టిక్కర్లు కూడా రానున్నాయి’’ అని ఫేస్ బుక్ కంపెనీ బ్లాగ్ లో పోస్ట్ చేసింది. డెవలపర్లు అభివృద్ధి చేసిన ధర్డ్ పార్టీ స్టిక్కర్లను కూడా వాట్సాప్ అనుమతించనుంది. వాట్సాప్ కు దేశంలో 20 కోట్ల యూజర్లు ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల మంది దీన్ని వినియోగిస్తున్నారు. ఈ సంస్థను 2014లో ఫేస్ బుక్ కొనుగోలు చేసింది.