వాట్సాప్‌తో కోటక్‌, ప్రభుదాస్‌ లీలాధర్‌ సేవలు

Whatsapp
Whatsapp

చెన్నై: వాట్సాప్‌నుంచి వచ్చిన బిజినెస్‌ యాప్‌సాయంతోనే కోటక్‌, ప్రభుదాస్‌ లీలాధర్‌ వంటి సంస్థలు సేవలందించేందుకు సన్నద్ధం అవుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్‌ వినియోగం భారీస్థాయిలో పెరిగింది. వీటికితోడు సోషల్‌ వెబ్‌సైట్లు యాప్‌లను కూడా విడుదలచేస్తున్నాయి.ఫేస్‌బుక్‌ అధీనంలోని వాట్సాప్‌ ఇందుకు బిజినెస్‌ వేదిక అయింది. కోటక్‌ సెక్యూరిటీస్‌ కొత్తగా చాట్‌టు ట్రేడ్‌ సేవలను కస్టమర్లకోసంప్రారంభించింది. చాటింగ్‌ ద్వారానేట్రేడింగ్‌ను సులభంచేసింది. ప్రభుదాస్‌ లీలాధర్‌ ఇప్పటికే వాట్సాప్‌ బిజినెస్‌ యాప్‌ద్వారా తన సేవలను అందిస్తోంది. కస్టమర్లుఈక్విటీ డెరివేటివ్‌ సగ్మెంట్లలో లైవ్‌చాట్‌ ఆప్షన్‌ద్వారా చర్చించకునే సదుపాయంఉంది. లైవ్‌మార్కెట్‌నువయా డీలర్‌ద్వారా ట్రేడింగ్‌చేసుఎకునే సదుపాయంఉంది. కేవలం చర్చల ద్వారానే ట్రేడింగ్‌కు వీలు కలుగుతోంది. వాట్సాప్‌ లేదా టెలిగ్రామ్‌మెసేంజర్‌ద్వారా కూడా తమ రిజిష్టర్డు మొబైల్‌నుంచి 7400102102 నెంబరును రిజిష్టరుచేసుకుని చర్చలు జరపవచ్చని అంచనావేసింది. జీవితకాలంలో ఒకేసారి అధీకృత సర్టిఫికేషన్‌ అవసరం అవుతుంది. ఎలాంటి మానవ ప్రమేయంలేకుండానే ధృవీకరణ రెండు స్టెప్‌ల విధానంలో పూర్తవుతుంది. ఎనిమిది సెక్యూరిటీ ప్రశ్నల్లో కస్టమరు కనీసం మూడు ప్రశ్నలకు సమాధానాలివ్వాల్సి ఉంటుంది. తేలికపాటి ప్రశ్నలను మాత్రమే అడుగుతారు. ఆ తర్వాత లాగిన్‌ యాక్సెస్‌కోడ్‌కు సైతం ప్రశ్నలు ఉంటాయి. ఈ తతంగం పూర్తయిన తర్వాత ఈ చాట్‌ను డీలర్లకు అందచేస్తారు. ప్రభుదాస్‌ లీలాధర్‌ మాత్రం వాట్సాప్‌ కామన్‌ నెంబరు 022-66322366నెంబరుసాయంతో సేవలు విజ్ఞప్తి, నివేదికలు, సందేహాలు, ఫిర్యాదులుఇతర రోజువారి ట్రేడింగ్‌ అవసరాలను తీర్చుకునే సదుపాయం ఉంది. కోటక్‌ సెక్యూరిటీస్‌ ఎండి సిఇఒ కమేలష్‌రావు మాట్లాడుతూ చాట్‌టు ట్రేడ్‌ కస్టమర్‌లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సాంకేతికపరమైన కొత్త ఒరవడుల ఆధారంగా చాట్‌టుట్రేడ్‌ ఆప్షన్‌ప్రవేశపెట్టామని, ఈక్విటీ,డెరివేటివ్‌ ట్రేడింగ్‌లలో యాప్‌ ట్రేడింగ్‌ ఎంతో సానుకూలంగా ఉంటుందని వెల్లడించారు.