వాట్సాప్‌కు సుప్రీం నోటీసులు

whatsapp
whatsapp

న్యూఢిల్లీ: సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు చెందిన మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇండియాలో ఇప్పటి వరకు ఫిర్యాదులు స్వీకరించే అధికారిని ఎందుకు నియమించలేదని ప్రశ్నించింది. వాట్సాప్‌తో పాటు కేంద్ర సమాచార, ఆర్ధిక శాఖలకు కూడా ఈ నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది. నకిలీ వార్తలకు అడ్డుకట్ట వేయడానికి కేంద్రం వివిధ చర్యలు తీసుకుంటున విషయం తెలిసిందే. అందులో భాగంగా అసలు సదరు నకిలీ వార్త ఎక్కడి నుంచి మోదలైందో తెలుసుకునేలా ఓ వ్యవస్థ రూపొందించాలని వాట్సాప్‌ను కేంద్రం ఆదేశించింది. ఐతే ఇది యూజర్ల గోప్యతకు భంగం కలిగించినట్లవుతుందని వాట్సాప్‌ అందుకు నిరాకరించింది. ఈ అంశంపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు …అసలు ఫిర్యాదులు స్వీకరించే అధికారిని ఎందుకు నియమించలేదంటూ నిలదీసింది.