వాంఖడేలో సన్‌రైజర్స్‌ రైజింగ్‌ విజయం

SUNRISERS 1
SUNRISERS

వాంఖడేలో సన్‌రైజర్స్‌ రైజింగ్‌ విజయం

వాంఖడే స్టేడియం,: ముంబాయి ఇండియన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాదు జట్లు మధ్య ముంబాయిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఐపియల్‌-23వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాదు విజయం సాధించింది. ఆద్యంతం పేలవంగా సాగిన మ్యాచ్‌లో ఇరు జట్లలో ఏ ఒక్కరూ క్రికెట్‌ ప్రేక్షకులను రంజింపచేయలేదు. మ్యాచ్‌ మొత్తానికీ కేవలం రెండే రెండు సిక్స్‌ర్లు నమోదయ్యాయి. సన్‌రైజర్స్‌ టీంలో విలియంసన్‌ 29(21),పఠాన్‌ 29(33)లు మాత్రమే కొంతలో కొంత రాణించారు.

119 పరుగుల ఛేజింగ్‌లో ముంబాయి 18.5 ఓవర్లకే 87 పరుగులకు అల్‌అవ్ఞట్‌ అయింది. సూర్యకుమార్‌ యాదవ్‌ 34(38),కుర్నాల్‌ పాండ్యా 24(20) మాత్రమే రాణించారు. మొదట టాస్‌ గెలిచిన ముంబాయి ఇండియన్స్‌ ఫీల్డింగ్‌ చేయాలని నిర్ణయించుకుంది. సన్‌రైజర్స్‌ ఓపెనర్లు శిఖర్‌ ధవన్‌, విలియంసన్‌లు ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. మొదటి ఓవరు నుండే ధాటిగా ఇండియన్స్‌ బౌలర్లపై దాడి చేసారు. మొదటి రెండు ఓవర్లలో పరుగుల వరదే పారింది. ఓపెనర్లు ఇద్దరూ భారీ షాట్ల్లకు ప్రయత్నించి విజయం సాధించారు. అయితే రెండవ ఓవర్లో సన్‌రైజర్స్‌ చతికిల పడింది. వెంట వెంటనే ఇద్దరు పెవిలియన్‌ ముఖం పట్టారు. 1.4ఓవర్లో మెక్‌ క్లినాగన్‌ చక్కటి బంతి విసిరి ధవన్‌ను బౌల్డ్‌ చేసాడు. అదే ఓవర్లో చివరి బంతికి వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌షా క్యాచ్‌ అవ్ఞట్‌ అయ్యాడు. దీంతో విలియంసన్‌పై భారం పడింది. అప్పటకి స్కోరు రెండు వికెట్ల నష్టానికి 20పరుగులు. విలియంసన్‌తో జతకలిసిన మనీష్‌పాడే16(11) దూకుడుగానే ఆడాడు. కానీ ఎక్కువ సేపు క్రీజులో నిలువలేదు. చకచకా మూడు బౌండరీలు కొట్టి పెవిలియన్‌ దారి పట్టాడు.

5.3ఓవర్లో షేక్‌ అల్‌ హసన్‌ రూపంలో మరోవికెట్‌ పడటంతో సన్‌రైజర్స్‌కు భారీ భాగస్వామ్య అవసరం ఏర్పడింది. అలోటును కొంత మేరకు తీర్చాడు యూసఫ్‌ పటాన్‌. కానీ స్కోర్‌బోర్డు మాత్రం ముందుకు జరగలేదు. 8.1ఓవర్లో 63 పరుగుల వద్ద ఐదవ వికెట్‌ రూపంలో విలియంసన్‌29(21) అవ్ఞట్‌ అయ్యాడు. ఆ తర్వాత పఠాన్‌,మెహమ్మద్‌ నాబిలు వికెట్లు కాపాడుకుంటూ మెల్లగా ఆడారు. దీంతో స్కోరు మరీ నత్తనడకన సాగింది. 11.1ఓవర్లో నాబి అవ్ఞటయ్యాడు. స్కోరు ఏమాత్రం ముందుకు నడవక పోగా అక్కడినుండి వరుగా ప్రతి రెండు ఓవర్లకు ఒక వికెట్‌ చొప్పున కూలిది. ఒకపక్క యూసఫ్‌ పఠాన్‌ ఒక్కడే ఒంటరి పోరాటం చేసినా మరోపక్క వికెట్లు కూలుతూ ఉండటంతో స్కోరును పెంచలేక పోయాడు. దీంతో 118 పరుగులకు సన్‌రైజర్స్‌ ఆల్‌అవ్ఞట్‌ అయింది.

ఇన్నింగ్స్‌ బ్రేక్‌ తర్వాత 119 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన ముంబాయి ఇండియన్స్‌ కూడా సన్‌రైజర్స్‌లానే రెండవ ఓవర్‌ నుండే తడబడింది. ఆరు ఓవర్లలోపే మూడు వికెట్లను కోల్పోయింది. ఎవిన్‌ లివిస్‌ ఒకే ఒక్క ఫోర్‌ కొట్టి సందీప్‌ శర్మ బౌలింగ్‌లో మనీష్‌ పాండేకు క్యాచ్‌ ఇచ్చి వెనుతిరాగాడు. ఇషాన్‌ కిషన్‌ పరుగుల ఖాతా ప్రారంభించకుండానే డకౌట్‌ అయ్యాడు. 5.2ఓవర్లో రోహిత్‌ శర్మ2(6) పెవిలియన్‌ దారి పట్టాడు. ఆ తర్వాత వచ్చిన కుర్నాల్‌ పాండ్యా వచ్చి కాసేపు మ్యాచ్‌లో జోష్‌ నింపాడు. ఎడాపెడా నాలుగు బౌండరీలు సాధించాడు. మరోపక్క సూర్యకుమార్‌ యాదవ్‌ జాగ్రత్తగా ఆడాడు.

11.5 ఓవర్లో పాండ్యా24(20) అవ్ఞట్‌ అయ్యాడు.అప్పటికి ముంబాయి స్కోరు ఐదు వికెట్ల నష్టానికి 64 పరుగులు. ఆతర్వాత 6 బ్యాట్స్‌మెన్లలో ఏ ఒక్కరూ రాణించలేదు. రెండంకెల పరుగులు సాధించలేకపోయారు. మ్యాచ్‌ మొత్తంలో ముంబాయి ఇండియన్స్‌ 12 ఎక్‌స్ట్రా పరుగులు ఇవ్వగా.. సన్‌రైజర్స్‌ 2పరుగులు మాత్రమే ఇచ్చింది. ముంబాయి జట్టులో ఇద్దరు డకౌట్లు అవ్వగా సన్‌రైజర్స్‌లో ఒక డకౌట్‌ నమోదయింది. ఇరు జట్లలో కలిపి 12మంది బ్యాట్స్‌మెన్లు రెండంకెల పరుగులకు చేరుకోనేలేదు. సన్‌రైజర్స్‌ జట్టులో సిద్ధార్ధకౌల్‌ 23పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు.