వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు?

తెలుసుకుందాం..

NATURE
NATURE

వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు?

వర్షం కురిసినప్పుడు ఒక బహిరంగ ప్రదేశంలోని సమతలం మీద ఎంత ఎత్తుకు నీరు చేరుకుం టుందో ఆ మట్టం ప్రాతి పదికగా అక్కడ కురిసిన వర్షపాతాన్ని కొలుస్తారు. దీనిని కొల వడానికి ఉపయోగించే వర్షమాపకం పరికరాన్ని లోహం తోగాని, ఫైబర్‌గ్లాస్‌తో గాని తయారుచేస్తారు. ఇది 8 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు వ్యాసం గల ఒక గరాటా తరహాలో ఉంటుంది. ఈ గరాటా ఒక లీటరు సామర్ధ్యం గల సీసాకు బిగి స్తారు. ఈ గరాటా ద్వారా సీసాలో పడిన వర్షపు నీటి ఘనపరిమాణం కొలవడానికి ఒక కొలజాడి ఉంటుంది. బహిరంగ ప్రదేశంలో సమతలంగా ఉన్న నేలమీద 30 సెం.మీ. ఎత్తున అమరు స్తారు.

ఆ సీసాలో సేకరించిన నీటి ఘనపరి మాణం కొలజాడీతో లెక్కిస్తారు. అందులో ఒక మిల్లీమీటరు కంటే తక్కువ వర్ష పాతాన్ని కూడా లెక్కించవచ్చు. వర్షపునీరు వర్షమాపకంలోని గరాటా ద్వారా సీసాలో పడి సీసా లో కొంత ఎత్తులో నిలు స్తుంది. సీసాలో సేకరించిన నీటి ఘన పరిమా ణాన్ని కొలజాడీతో కొలిచి, ఆ ప్రదేశంలోని వర్ష పాతాన్ని లెక్కకడతారు. వర్షమాపకం పరికరం ఒక సన్నని గొట్టం తరహాలో ఉంటుంది. ఆ గొట్టంమీద వరుసగా కొలతలు ముద్రించి ఉం టాయి.

గొట్టంలోకి చేరిన వర్షపు నీరు ఆధారం గా ఏర్పడిన నీటిమట్టాన్ని అనుసరించి వర్షపాతా న్ని మిల్లీమీటర్లలో కొలు స్తారు. ఒకవేళ రోజుల తరబడి వర్షం కురుస్తున్న సందర్భంలో ఆటోమా టిక్‌ వర్షమాపక పరికరాన్ని ఉపయోగించి కొలుస్తారు. ఆ విధంగా సేకరించిన నీటిని, బరువును కొలుస్తారు. ఎంత బరువు కలిగిన నీరు ఎంత వర్షపాతాన్ని సూచిస్తుందో తెలిపే ఛార్ట్‌లను ముందుగానే రూపొందించి, ఏక కాలంలో ఎంత స్థాయి వర్షం కురిసిందో మిల్లీ మీటర్‌లలో తెలుసుకోవచ్చు. ఎక్కడైనా సంవత్సరం మొత్తంలో వర్షపాతం 254 మి.మీ. (10 అంగుళాలు) అంటే తక్కువ ఉంటే ఆ ప్రాంతాన్ని ఎడారిగా వ్యవహరిస్తారు. ఏ ప్రాంతమైనా జలవనరులతో కళకళలాడా లంటే 508 మి.మీ. (20 అంగుళాలు)లకు మించిన వర్షపాతం ఉండితీరాలి.