వర్షం కారణంగా ముగిసిన నాలుగోరోజు ఆట

test series
test series

సిడ్నీ: టీమిండియా- ఆసీస్‌ మధ్య జరుగుతున్న చివరి టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. వెలుతురు లేమి, వర్షం కారణంగా తొలుత మ్యాచ్‌ను ఆపేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఐతే పరిస్థితి మెరుగుపడకపోవడంతో నాలుగోరోజు ఆటను ముగిస్తున్నట్లు తెలిపారు. తొలి ఇన్నింగ్స్‌లో 322 పరుగులు వెనకబడిన పైన్‌ సేన ప్రస్తుతం ఫాలో ఆన్‌ ఆడుతుంది. ప్రస్తుతం క్రీజులో ఉస్మాన్‌ ఖ్వాజా(4), మార్కస్‌ హారిస్‌(2) లు ఉన్నారు. ఆట ముగిసే సమయానికి నాలుగు ఓవర్లకు వికెట్‌ కోల్పోకుండా ఆసీస్‌ 6 పరుగులు చేసింది.