వర్గీకరణ సమస్యపై మాట్లాడండి

BREAKING NEWS
BREAKING NEWS

విద్యానగర్‌: ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లో వర్గీకరణ బిల్లును ఆమోదించాలని ఎంఆర్‌పిఎస్‌ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. కాంగ్రెస్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ అంశంపై మానిఫెస్టోలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. సోమవారం విద్యానగర్‌లోని ఎంఆర్‌పిఎస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వంగపల్లి శ్రీనివాస్‌తో కలిసి మేడి పాపయ్య మాట్లాడారు. ప్రతిసారి మాదిగలు, ఉపకులాలను ఓటుబ్యాంకుగా భావించే కాంగ్రెస్‌ ఇప్పటికైనా వర్గీకరణపై స్పందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రతిపక్ష నేతగా రాహుల్‌ పార్లమెంటులో వర్గీకరణ బిల్లు పెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. ముందస్తు ఎన్నికల మేనిఫెస్టోలో వర్గీకరణకు మద్దతుగా కాంగ్రెస్‌కు ఇచ్చిన హామీపై మంద కృష్ణ స్పష్టత ఇవ్వాలని ఈసందర్భంగా మేడి పాపయ్య కోరారు. వంగపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. ప్రతిపక్షానికి ప్రజల తరఫున మాట్లాడే బాధ్యత ఉందన్న వాస్తవాన్ని గుర్తించి పార్లమెంటులో బిల్లుపై చర్చ జరిగేలా కాంగ్రెస చొరవ చూపాలని కోరారు. తప్పిదాలను సరిద్దిద్దుకుని ఇప్పటికైన మాదిగలు, ఉపకులాల సమస్యపై కాంగ్రెస్‌ స్పందించకపోతే మరింత మూల్యం చెల్లించాల్సి వస్తుందన్నారు. కాగా వర్గీకరణ సాధనకై జనవరి మొదటి వారంలో ఛలో ఢిల్లీ పేరిట ఆందోళనలు చేపడతామని మేడిపాపయ్య, వంగపల్లి పేర్కొన్నారు. దండు సురేందర్‌, కొక్కరె భూమన్న, శ్యాంరావు, కొల్లూరి వెంకట్‌, సైదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.