వరల్డ్ ఫుడ్ ప్రయిజ్ సదస్సుకు ఆహ్వానం

వరల్డ్ ఫుడ్ ప్రయిజ్ సదస్సుకు ఆహ్వానం
ఆగస్టులో కర్నూలులో మెగా ఫుడ్‌పార్క్ ప్రారంభం
సచివాలయం: ప్రపంచ ఆహార సంస్థ అక్టోబర్‌లో నిర్వహించే వరల్డ్ ఫుడ్ ప్రయిజ్ సదస్సుకు హాజరుకావాలని సిఎం చంద్రబాబుకు ఆహ్వానం లభించింది.. అయోవా రాష్ట్రంలో డెమోయిన్లో అక్టోబర్ 19 నుంచి 21 వరకు జరిగే ఈ సద్సుకు దేశ, ప్రపంచస్థాయి సంస్థలఅత్యున్నత ప్రజాప్రతినిధులు, అధిపతులు మాత్రమే హాజరవుతారు.. వరల్డ్ ఫుడ్ ప్రయిజ్ సదస్సుకు హాజరుకావాలని అయోవా వర్సిటీ ప్రతినిధి దిలీప్‌కుమార్ సిఎం చంద్రబాబును ఉండవల్లిలో ఆయన నివాసంలో కలుసుకుని ఆహ్వానం అందించారు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అయోవా యూనివర్సిటీ సంయుక్తంగా వరల్డ్ ఫుడ్ ప్రయిజ్ సదస్సులో వ్యవసాయ రంగంపై ప్రత్యేకంగా సభ నిర్వహించదలిచారు..
ఈసభకు హాజరుకావటానికి సిఎం చంద్రబాబునాయుడు అంగీకారం తెలిపారు. వరల్డ్ ఫుడ్ ప్రయిజ్ సదస్సుకు దేశంలో ఒక్క సిఎం చంద్రబాబుకు మాత్రమే రావటం గర్వకరణఱంగా భావిస్తున్నట్టు ప్రభుత్వ అధికారులు పేర్కొంటున్నారు.. అమెరికాలోని వ్యవసాయ రంగంలో పరిశోధనల్లో విశేష కృషిచేస్తున్న అయోవా యూనివర్సిటీ నుంచి మరోసారి ఆహ్వానం సిఎం చంద్రబాబుకు లభించం విశేషం.. రైతన్నను రాజు చేయాలన్న సంకల్పంతో సిఎం చంద్రబాబు పర్యటన సత్ఫలితాలు దిశగా అడుగులుపడుతున్నా యటానికి అయోవా యూనివర్సిటీతో కలిసి అక్టోబర్‌లో వరల్డ్ ఫుడ్ ప్రయిజ్ నిర్వహణకు సిద్ధమవటం ఉదాహరణగా పేర్కొంటున్నారు..
అమెరికా పర్యటనలో గత 7న అయోవా రాష్ట్ర రాజధాని డిమో ఇన్‌లోని వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ భవనంలో ఇరు రాష్ట్రాల మధ్య ఎంఒసి కుదిరిన విషయం తెలిసిందే.. ఈ ఎంఒసి మూలంగా కర్నూలులో మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వానికి అయోవా వర్సిటీ సంపూర్ణ సాంకేతిక సహకారం లభించనుంది.. ఆగస్టులో కర్నూలులో మెగా ఫుడ్‌పార్క్‌కు ప్రారంభోత్సవం జరగనుంది.. ఈమేరకు ఒక్కొక్క అడుగు ముందుకు పడటంతో భాగంగా అయోవా యూనివర్సిటీ ప్రతినిధి దిలీప్‌కుమార్ ఆధ్వర్యంలో బృందం మే 20న ఇటీవల అమరావతిలో పర్యటించింది..
ఇన్సెప్షన్ వర్క్ షాప్ కూడ నిర్వహించింది.. ఇందులో రాష్ట్రానికి చెందిన రైతులు, టేక్ హాల్డర్స్, వ్యవసాయ పరిశోధన విశ్వవిద్యాలయం, విత్తన పరిశ్రమ ప్రతినిధులు, వ్యవసాయ శాఖ కమిషన్లు కూడ పాల్గొని విత్తనాల నాణ్యత పెంపుదల, సర్టిఫికేషన్, నకిలీ విత్తనాల నిర్మూలన, మిగులు విత్తనాలు, ఇతరత్రా తీసుకోవాల్సిన అంశాలపై ఆయా వ్యక్తుల ఆలోచనలను ఆహ్వానించారు.. ఎగుమతి అవకాశాలున్న ఆసియా, ఆఫ్రికా దేశాలకు విత్తనాలు ఎగుమతులు చేయటానికి కావాల్సిన ఫైటో సానిటరీ సర్టిఫికెట్ సాధించటానికి గల అవకాశాలపైనా చర్చించారు..