వరల్డ్‌ కప్‌లో ఆడాలన్నదే లక్ష్యం: దినేష్‌ కార్తీక్‌

DineshKarthik
DineshKarthik

ముంబాయి: భారత్‌ క్రికెట్‌ జట్టులో దినేష్‌ కార్తీక్‌ ప్రతిభ గురించి చెప్పక్కర్లేదు. ఇటీవల వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లిన
జట్టులో చోటు దక్కించుకున్న దినేష్‌. ఈ పర్యటనలో భాగంగా నిర్ణయాత్మక ఐదో వన్డేలో అర్థ
సెంచరీ చేశాడు, తర్వాత జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌లో 48 పరుగులు నమోదు చేశాడు. దీంతో
మూడేళ్ల తర్వాత తన పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తన పునరాగమనాన్నిఘనంగా చాటుకున్నట్టయింది. ఒక
మీడియా ఛానల్‌ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో దినేష్‌ కార్తీక్‌ విరాట్‌ కోహ్లీ కెప్టెన్సీలో తనకు టెస్ట్‌
మ్యాచ్‌లో తిరిగి ఆడాలనే అభిప్రాయాన్ని తెలిపారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఎటువంటి ఒత్తిడికి
గురికావడంలేదని, నాకిచ్చిన పనిని సమర్థవంతంగా చేయడం పైనే దృష్టి సారిస్తున్నట్లు,
2019 ప్రపంచ కప్‌లో ఆడాలనే ఆకాంక్షనులక్ష్యంగా పెట్టుకున్నానని కార్తీక్‌ తెలిపారు.