వరల్డ్‌కప్‌కు మరో ముగ్గురి పేర్లు!

rishab pant, ajinkya rahane, vijay shanker
rishab pant, ajinkya rahane, vijay shanker

ముంబై: వరల్డ్‌కప్‌ కోసం టీమిండియా జట్టులో సభ్యుల ఎంపిక కోసం భారీగా కసరత్తు జరుగుతుంది. ఏప్రిల్‌ 23 ఆఖరు తేదీ కావడంతో సెలక్టర్లు ఆ పనిలో బిజీగా ఉన్నారు. ఒకటి, రెండు స్థానాలు తప్ప ఇప్పటికే దాదాపు అన్ని బెర్తులు ఖరారాయ్యయని చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ వెల్లడించారు. తాజాగా మరో ముగ్గురి పేర్లను టీమ్‌ కోసం పరిశీలిస్తున్నట్లు అతను చెప్పాడు. రిషబ్‌పంత్‌తతో పాటు టెస్ట్‌ టీమ్‌వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానే, ఆల్‌రౌండర్‌ రిషబ్‌పంత్‌ పేర్లను కూడా పరిశీలిస్తున్నారు. టెస్టుల్లో ఇప్పటికే తన సత్తా నిరూపించుకున్న పంత్‌, విజ§్‌ు శంకర్‌ బాల్‌తో కాకపోయినా బ్యాట్‌తో మాత్రం బాగానే ఆకట్టుకుంటున్నాడు. మూడో ఓపెనర్‌గా రహానే పేరును పరిశీలిస్తున్నామని చెప్పారు. వరల్డ్‌కప్‌లో భాగంగా ఇండియా తన తొలి మ్యాచ్‌ను జూన్‌ 5న సౌతాఫ్రికాలో ఆడనుంది.