వరద తగ్గిన కేరళకు ర్యాట్‌ఫీవర్‌ వైరస్‌

FEVER
FEVER

ఆసుపత్రుల్లో 484 మంది వ్యాధి పీడితులు
తిరువనంతపురం: కేరళను పట్టిపీడించిన వరద భీభత్సంలో వేలాది కుటుంబాలకు అపార నష్టం వాటిల్లితే ఇపుడు వర్షాలు తగ్గుముఖం పట్టినా విషజ్వరాలు, అంటువ్యాధులు కేరళను అతలాకుతలంచేస్తున్నాయి. వరదనీరు తగ్గినతర్వాత కేరళలో ఎక్కువగా అంటువ్యాదులు ప్రభలిపోతున్నాయి. ఈ వ్యాధిసోకిన జంతువులు విడుదలచేసే వ్యర్ధాలనుంచి అంటువ్యాధులు వ్యాపిస్తున్నాయి. సహజంగా వీటిని ర్యాట్‌ఫీవర్‌ లేదా లెప్టోస్పిరోసిస్‌ వ్యాధిగా పిలుస్తుంటారు. ప్రస్తుతం ఈ వ్యాధికారణంగా ముగ్గురు వ్యక్తులుచనిపోయారు. వీరిలో ఇద్దరు పునరావాస కార్యక్రమాల్లో పాల్గొన్న స్వఛ్ఛంద సంస్థలప్రతినిధులుసైతం ఉన్నారు. సుమారు 464 మంది వ్యాధిపీడితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్సపొందుతున్నారు. కేరళ వైద్యఆరోగ్యశాఖ ఈ అంశాన్ని తీవ్రంగాపరిగణించి ప్రజలను అప్రమత్తంచేస్తోంది. వెంటనే వైద్యచికిత్సలు చేయించుకోవాలని, వ్యాధినిరోధక చికిత్సలు మందులు తీసుకోవాలని సూచించింది.అలుప్పూజ జిల్లాలోను, వాయనాడ్‌ వంటి ప్రాంతాల్లో ఎక్కువ వ్యాధులు సోకాయి. ఈ వ్యాధిసోకనిక వారికి వెంటనే తీవ్రస్థాయి జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు, శరీరం, కళ్లు పచ్చరంగులోనికి రావడం కనిపిస్తుంది. కొన్నిసార్లు ఎరుపురంగు కూడా వస్తుంది. తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు విరోచనాలు, చర్మంపై దద్దుర్లు వస్తుంటాయి. ముందుగా జ్వరంతోప్రారంభం అయి తీవ్రస్థాయికి చేరుస్తుందని వైద్యులు హెచ్చరికలుచేస్తున్నారు. ఈ వ్యాధిసోకిన వారు కోలుకోవడం కొన్ని నెలలుసైతం పడుతుందని చెపుతున్నారు. లెప్టోస్పిరోసిస్‌ అత్యంత అరుదైన వ్యాధికారక బ్యాక్టీరియా అని ఎలుకలు విడుదలచేసే మూత్రంనుంచి సోకుతుందని తేలింది. సహజంగానే ఎలుకలు కలుషిత జలాల్లో ఉంటాయి. అందువల్ల ఈ నీటిలో తిరుగాడినా వ్యాధులు సోకుతాయని వైద్యులుచెపుతున్నారు. కోజికోడ్‌లోకూడా వైద్యఆరోగ్యశాఖ ముందస్తు నివారణ మందులను పంపిణీచేసింది.