వరదలు వచ్చినా తట్టుకునేలా నిర్మాణాలు

eetela rajendar
TS Minister Eetela Rajendar

వరదలు వచ్చినా తట్టుకునేలా నిర్మాణాలు

హైదరాబాద్‌: వదరలు, ఉపద్రవాలు వచ్చినా వాటిని తట్టుకునేలా నిర్మాణాలు చేపట్టామని మంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. 2019 ఫిబ్రవరిలోగా మిడ్‌మానేరు పూర్తిచేయాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. గతపాలకులు రైతుల గురించి ఏనాడూ పట్టించుకోలేదన్నారు. కరెంటు అడిగితే కాల్పులు జరిపించిన చరిత్ర చంద్రబాబుకే దక్కిందన్నారు. వైఎస్‌హయాంలో జలయజ్ఞంను ధనయజ్ఞంగా మార్చివేశారని ఆయన దుయ్యబట్టారు.