వరంగల్‌ వారియర్స్‌పై గద్వాల్‌ గ్లాడియేటర్స్‌విజయం

KABADDI
KABADDI

-తెలంగాణ ప్రీమియర్‌ కబడ్డీ
హైదరాబాద్‌: తెలంగాణ ప్రీమియర్‌ కబడ్డీ సీజన్‌-2లో 11వరోజైన మంగళవారం జరిగిన మ్యాచ్‌లో వరంగల్‌ వారియర్స్‌పై 29-33 స్కోరుతో గద్వాల్‌ గ్లాడియేటర్స్‌విజయం సాధించింది. వరుస విజయాలతో బరిలోకి దిగిన వరంగల్‌ జట్టు ఓటమి చవిచూడాల్సివచ్చింది. తొలిఅర్థభాగంలో హోరాహోరిగా సాగగా చివరికి గద్వాల్‌ జట్టు విజయం సొంతం చేసుకుంది. బెస్ట్‌ రైడర్‌అవార్డు డి.వంశీ (గద్వాల్‌) సొంతం చేసుకోగా,బెస్ట్‌ డిఫెండర్‌ అవార్డ్‌ నరేష్‌ (గద్వాల్‌ ) సొంతం చేసుకున్నాడు. కాగా ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లో 22పాయింట్లతో వరంగల్‌ వారియర్స్‌ మొదటిస్థానంలో ఉండగా, 18పాయింట్లతో గద్వాల్‌ గ్లాడియోటర్స్‌ రెండవస్థానంలో ఉంది. 17పాయింట్లతో రంగారెడ్డి ,పాలమూరు జట్లు తర్వాత స్థానాల్లో ఉన్నాయి.11పాయింట్లతో నల్గొండ ఈగల్స్‌జట్టు చివరి స్థానంలో ఉంది.