వయసు పెరిగే కొద్దీ తగ్గే జీర్ణక్రియ

OLDAGE
OLDAGE

వయసు పెరిగే కొద్దీ తగ్గే జీర్ణక్రియ

నూతన ఆయుర్దాయం ఎంతన్నది ఏ వ్యక్తికీ తెలియదు. అయితే బ్రతికినంతకాలం ఆరోగ్యంగా బ్రతకాలని, ఎవరిచేత చేయిం చుకోకుండా సాధ్యమైనంత ఎక్కువ కాలం బ్రతకాలనే ఆశ ప్రతి వ్యక్తికీ ఉంటుంది. అందుకే పెద్దలు దీవించేటప్పుడు దీర్ఘా యుష్మాన్‌భవ అని దీవిస్తుంటారు. అదే సమయంలో ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా తనువ్ఞ చాలించాలని మాత్రం ప్రతివ్యక్తీ కోరుకుంటాడు. ఇది అందరికీ సాధ్య పడుతుందా అంటే సమాధానం మన దగ్గర ఉండదు.

అయినా మనిషి ఆశా జీవి కనుక, ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి మనిషీ ప్రయత్నిస్తునే ఉంటాడు. ఆధునిక వైద్య విజ్ఞానం యొక్క ప్రభావం, ప్రజలలో ఆరోగ్యం పట్ల అవగాహన పెరగటం తది తర కారణాల వలన పలు దేశాలలో ప్రజల సగటు ఆయుర్దాయం పెరిగింది. దానితో బాటు వృద్ధుల శాతం కూడా గణనీయంగా పెరిగింది. ఒకానొక నివేదిక ప్రకారం ప్రస్తుత చైనా జనాభా 120 కోట్లలో మూడు వంతులు పైగా 60 సంవ త్సరాలు దాటినవారే. అదే సమయంలో ఆహారమే అద్భుతమైన, అన్నింటికన్న శక్తివంతమైన మందు అని అన్ని వైద్య నివేదికలు స్పష్టం చేస్తున ా్నయి. ఈ నేపథ్యంలో 50, 60 సంవత్సరాల వయసు దాటిన వారు, ఆరోగ్యంగా ఉంటూ ఆయుర్దాయం పెంచు కోవటానికి ఎటు వంటి ఆహారాన్ని తీసుకోవాలో సంక్షిప్తంగా తెలుసుకుందాం.

వయసుపైబడే కొద్దీ జీవక్రియ మందగిస్తుంది. ఆకలి మంద గిస్తుంది. జీర్ణక్రియ సరిగా ఉండదు. శక్తిక్రమేపి క్షీణించటం ప్రారంభిస్తుంది. కొత్తకణాల ఉత్పత్తి వేగం తగ్గి, ఉన్న కణాలు శిధిలం కావటం వేగవంతమవ్ఞతుంది. రోగ నిరోధక శక్తి మందగించటంతో అప్పటి వరకు అణిగి ఉన్న వ్యాధులు, వంశ పారంపర్య దీర్ఘ వ్యాధులు మెల్ల మెల్లగా బయట పడు తుంటాయి. ఇటు వంటి పరిస్థితులలో వృద్ధులు తమ జీవన శైలిని, ఆహార నియమాలను మార్చుకోవలసి ఉంటుంది.

ఆ క్రమంలో వయసు మీద పడటంతో దాహంవేయదు. అయినా క్రమంతప్పకుండా ప్రతి రోజు కనీసం ఎనిమిది గ్లాసు ల మంచి నీరు తీసు కోవాలి. ఇందువలన పోషకాలన్నీ శరీరంలోని అన్ని భాగాలకు చేరుతాయి. శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా నిలకడగా ఉంచబడుతుంది. త్వరగా జీర్ణమయ్యే బలవర్ధకమైన ఆహార పదార్థాలను మాత్రమే భుజించాలి.

ఎముకలు దృఢంగా ఉండాలి గనుక సాధారణం కన్న ఎక్కువగా సున్నం అవసరమవ్ఞతుంది. ఆ సున్నం శరీ రానికి వంట బట్టాలంటే విటమిన్‌ డి అవసరం. అందు వలన విటమిన్‌ డి, సున్నం పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలను కొరత లేకుండా తీసుకోవాలి. వృద్ధా ప్యంలో రోగనిరోధకశక్తి తగ్గకుండా తగుజాగ్రత్త వహించాలి. రోగ నిరోధక శక్తిని పెంచే శక్తి ఒక్క జింక్‌ లోహానికే ఉన్నది. (హోమి యోపతిలో జింక్‌ మెటాలికం) అందు వలన, జింక్‌ లోహం ఎక్కువగా డే పదార్థాలను ఎంపికచేసి తీసుకోవాలి. నాడీ వ్యవస్థ సక్రమంగా ఉండటానికి, ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి విటమిన్‌ బి 12 అవసరం.

కనుక ఆ విట మిన్‌ పుష్కలంగా ఉండే ఆహారం అవ సరం. వీటితో బాటు మలబద్ధకాన్ని నివారించే పీచుపదార ా్ధలతో కూడిన ఆహారాన్ని, ఇంకా ఫోలిక్‌ ఆసిడ్‌, విట మిన్‌ బి సమృద్ధిగా ఉండే ఆహారమూ కావలసి ఉంటుంది. పైన ఉదహ రించడి నవన్నీ సమపాళ్లలో ఉండే సమీకృత ఆహా రాన్ని ఎంపిక చేసుకోవటం కొంచెం కష్టతరమే అయినప్పటికీ మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది కనుక కొంచెం కష్టపడాలి. ఆ క్రమం లో విభిన్న రంగులలో లభించే ప్రకాశ వంతమైన రంగులలో ఉండే పండ్లు, ఫలాలను ఎంచుకోవాలి. ఆహారాన్ని కొద్ది మోతాదులో ఎక్కువసార్లు తీసు కోవటం అలవాటు చేసుకోవాలి.

ఒంటరి తనాన్ని దూరం చేసుకుంటూ నలుగురితో కలిసి షాపింగ్‌ చేయటం, నలుగురితో కలిసి భోజనం చేయటం అల వాటుచేసుకోవాలి. ఇష్టమైన వినోదంతో సినిమాలు కావచ్చు, సంగీతం కావచ్చు, స్నేహితు లతో కబుర్లు కావచ్చు, విహార యాత్రలు కాని వెళ్లటంతో కాలక్షేపం చేయవచ్చు. ఈ విధంగా ఆహార విధి విధానాలతో బాటు జీవనశైలిని కూడా మార్చుకుంటే వృద్ధాప్యం కూడా ఆనంద మయం అవుతుంది. ఆరోగ్యంగా, ఆనందంగా వృద్ధా ప్యాన్ని ఆస్వాదించవచ్చు.