వయసులోనే అంతా ఉంది

                  వయసులోనే అంతా ఉంది

happy family
happy family

యవ్వనంలోకి అడుగుపెట్టిన పిల్లలు కొత్త అవతారం ఎత్తుతారు. ఇంట్లో కొత్తగా పెట్టిన హోమ్‌రూల్స్‌ నుంచి కాస్త స్వాతంత్య్రం,సొంత అభిప్రాయాలకు కాస్త విలువ, వ్యక్తిగత విషయాలు, నేనూ సంపాదిస్తు న్నాను అనే ధోరణిలో ఆర్థిక స్వాతంత్య్రం కోరుకోవడం… ఇలా ఎన్నో కొత్త కొత్త ఆలోచనలతో తల్లిదండ్రుల అంచనాలకు అడ్డు పడుతున్నటు ్లగా ప్రవర్తిస్తారు. కాబట్టి బాధ్యత తీరు మారుతుందే తప్ప తీరినట్లు కాదు అంటున్నారు నిపుణులు.ఇలాంటి మార్పులన్నింటినీ చూసి ఏదో జరిగిపోతుంది, పిల్లలు పాడైపోతున్నారని ఆందోళన చెందడం, వారిపై అధికారంతో దాడిచేయడం సత్ఫలితాలను ఇవ్వదని, చాలాసున్నితంగా వారి మనసులకు దగ్గరగా మాట్లాడుతూ మార్చు కోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని మానసిక విశ్లేషకులు చెబుతున్నారు.

ఇంట్లో మీరు చెబుతున్న విషయాలకు భిన్నమైన చాలా ప్రపంచాన్ని, ఎన్నో ఆలోచనలను నిత్యం చాలా తక్కువ వ్యవధిలోనే చూసే పిల్లలు రెండింటి మధ్య కాస్త మానసిక సంఘర్షణకు లోనవుతారు. ఈ క్రమం లో మీరు కోరుకుంటున్న దానికి చాలా భిన్నంగా వారు, వారి పనులు కనిపి స్తాయి. ఇలాంటపుడు వారు ప్రమాద కరమైన జీవనవిధానానికి అలవడకుండా ఉండాలంటే?… ముందుగా మీకు, మీ పిల్లలకు ఉన్న వ్యత్యాసంలో సామాజిక పరి స్థితుల్లో, జీవనశైలిలో వచ్చిన మార్పులను గుర్తించాలి.

అప్పుడు పిల్లలు చేసే ప్రతి పనీ విరుద్ధంగా కనిపించడం తగ్గుతుంది. మారిన పరిణామాలకు సరైన కారణాలు కూడా దొరుకుతాయి. ఆ తరువాత పిల్లలు చేసే పనులపై ఉన్న కోపాన్ని వారిపై మీకున్న ప్రేమను విడి విడిగా చూడగలగాలి. మీ మధ్య ఉన్న సంబంధాలు బెడిసికొట్టకుండా ఉన్నంతవరకే మీ మాటపై వారికి గౌరవం, భక్తి, భయం ఉండేది. ఈ విషయాన్ని గుర్తుంచుకొని మీకు మీ పిల్లలకు ఆలోచన, జీవనశైలి, అభిరుచుల్లో ఉన్న మార్పులను(పిల్లల జీవితానికి చేటు చేయని వాటిని) అంగీకరించే ప్రయత్నం చేయాలి.
గౌరవించుకోవాలి : ‘నిన్నగాక మొన్న పుట్టావు…నువ్వు నాకే చెబుతు న్నావేంటే ఇలాంటిమాటలు పిల్లల మనోభావాల్ని, వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉంటాయి. వారి అభిప్రాయాల్ని గౌరవిస్తూనే అందులో ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయో…వాటివల్ల వచ్చే అనర్థాలేంటో వివ రించే ప్రయత్నం చేయాలి. ఇది పిల్లలకు మీ పట్ల ఉన్న పాజిటివ్‌ దక్పథాన్ని చెబుతుంది. వారుకోరుకుంటున్న స్వేచ్ఛ, వెలిబుచ్చుతున్న అభిప్రాయాలు…ఇవన్నీ వారిలో మానసిక పరివర్తనను సూచిస్తాయి. వాళ్లు విషయాలను ఛాలెంజింగ్‌గా స్వీకరించడమే అందుకు నిదర్శనం.

మిగతావారికి భిన్నంగా ఉండాలను కోవడం కూడా ఇందులో భాగమే. ముఖ్యంగా పిల్లల్ని నిర్ధేశించడంలో… నియంత్రించడంలో, వారికి రక్షణ కల్పించడంలో… కాపాడుకునే ప్రయత్నం చేయటంలో సమతుల్యత కోల్పోకుండా చూసుకుంటే ఏదీ వారికి నియంత్రణలా అనిపించదు అనేది మనో విశ్లేషకుల అభిప్రాయం. వాళ్లకు బాధ్యత కల్పించాలి. ఒక్కసారి వాళ్లకు మీరు బాధ్యత కలిగేలా చేస్తే ఆ తరువాత మీరిచ్చే స్వాతంత్య్రాన్ని వాళ్లు ఏమాత్రం దుర్వినియోగం చేసే అవకా శం ఉండదు. బాధ్యతలేని స్వాతంత్య్రం వారి జీవితాన్ని ఎటైనా తీసుకువెళ్లచ్చు. బాధ్యతతో కూడిన స్వాతంత్య్రం మాత్రం కోరుకున్న గమ్యంవైపే అడుగులు వేయిస్తుంది.
ఎలా మాట్లాడాలి? : అమ్మాయి నిజంగానే మీ పట్ల వ్యతిరేకంగా ఉందా? లేదా నిజంగా, న్యాయంగా తను పొందాల్సిన ఆనందాన్ని కోల్పోతున్నాననే బాధలో అలా మాట్లాడుతుందా? తెలుసుకునే ప్రయ త్నం చేయాలి. అలాగే ఏ విషయంలో తనను మీరు హ్యాండిల్‌ చేయ లేకపోతున్నారో ఒక నిర్థారణకు రావాలి. అంతేగాని వాదోపవాదాలు పెంచుకునే ప్రయత్నం చేయకూడదు. ఇలాంటి వారి విషయంలో ఎప్పుడు? ఎలా? పూర్తిగా జోక్యం చేసుకోవాలి? అనేప్రశ్నలు ముందు గా మిమ్మల్ని మీరు వేసుకోండి. అర్జంటుగా స్పందించాలా, ఇంతలో జరిగిపోయే నష్టమేమీలేదు కాస్త చూసి తప్పనిసరైతే మాట్లాడదాం అనే విషయమా, ఏదో ప్రశాంతంగా ఉన్నపుడు కాస్త సమయం దొరికినపుడు కూల్‌గా చర్చించుకుంటే సరిపోతుందా? అనేది పెద్దవాళ్లు ఆలోచించుకుని చేస్తే ఫలితాలు బాగుంటాయి.
్త మిమ్మల్ని మీరు ఒక బాధితుల్లా భావించుకోవడం, ‘ ఇలా జరగడానికి కారణం నువ్వే అంటూ అలాంటి పిల్లల్ని పదే పదేే అనడం…లాంటి వాటిని పూర్తిగా దూరంగా పెట్టాలి. ఎందుకంటే ఇది పిల్లలు మీరు కలిసి పరిష్కరించుకోవా ల్సిన సమస్య. కాబట్టి వేరుచేసి దూషించడం వల్ల ఫలి తాలు రావు.
్త ‘నువ్వు చాలా డేంజర్‌ అనే మాటలు, పిల్లల గౌరవానికి భంగం కలిగే మాటలు మాట్లాడకుండా ఉంటే మంచిది. అలాగే చెప్పే ప్రతి విషయం వారికి మీరు ఆర్డర్‌ వేస్తున్నట్లు ఉండకుండా చూసుకోవాలి.
్త వారి జీవితం పట్ల తల్లిదండ్రులుగా మీకున్న భయాల్ని, వారిపట్ల పెంచుకున్న ప్రేమను ప్రశాంతంగా వారితో చర్చించి పంచుకోండి. వారిలో ఉన్న చెడునే మీరు ద్వేషిస్తున్నారని, వాళ్లను కాదని అర్థమవు తుంది. అసలు మీ పట్ల వ్యతిరేకంగా, రెబల్‌గా ఉండటానికి గల కారణాలు, వారి బాధలేంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వాటికి పరిష్కారాలు కూడా కలిసే ఆలోచించుకోవడం మరింత త్వరగా ఫలితాన్ని ఇస్తుంది.్త మీ మాట వినకుండా వాళ్లు ఏదైనా సమస్యలో చిక్కుకున్నపుడు ‘నే చెబితే విన్నావా…నీకు ఇలా జరగాల్సిందే లాంటి మాటలు అనకూడదు. ఇది శత్రుత్వాన్ని పెంచుతుందే తప్ప పశ్చాత్తా పం కలుగనీయదు. అలాంటపుడే పిల్లల్ని అక్కున చేర్చుకొని జరిగిన దానికి మీరెంత బాధపడుతున్నారో తెలిసేలా చేస్తే సరిపోతుంది.
్త పిల్లలతో దయగా, ప్రేమగా, సున్నితంగా మాట్లాడే ప్రయత్నం చేస్తే ఎలాంటి అంతరాలూ ఏర్పడవు. అప్పటికే ఉన్నవి కూడా తొలగిపోతా యి. ఇలాంటి కమ్యూనికేషన్‌ ఏవిషయాన్నైనా చెప్పుకునే స్వాతంత్య్రా న్ని, బలాన్ని ఇస్తుంది.