వయసుబట్టి అందచందాల మెరుపు

CUTE
CUTE

వయసుబట్టి అందచందాల మెరుపు

సౌందర్యాన్ని నిర్వచించినపుడు చర్మకాంతి ముందు వరుసలోనే ఉంటుంది. మెరుపులీనే చర్మం చూసే కళ్లను ఆకట్టుకుంటుంది. అంతేకాదు, వయసుని చెప్పే శారీరక లక్షణాల్లో కూడా చర్మానిదే ప్రధమ స్థానం. యవ్వనవంతమైన చర్మం ఉన్న వారు తక్కువ వయసున్న వారిలా కనిపించడం అందరికీ తెలిసిన విషయమే. వయసు పెరుగుతున్న కొద్దీ చర్మకాంతి తగ్గుతుండటం సహజమే. పెదవుల పక్కన, కళ్ల దగ్గర, మెడమీద కనిపించే ముడతలు పెరుగుతున్న వయ సుని చెబుతుంటాయి. ప్రత్యేకంగా వయసు కార ణంగా చర్మంలో వచ్చే ఇలాంటి మార్పులను నిరోధిం చేందుకు ఆయా వయసులకు తగ్గ అవసరాలను బట్టి సౌందర్య ఉత్పత్తులు నేడు మార్కెట్‌లో దొరుకుతున్నాయి-

ఇలా వివిధ వయసుల్లో వచ్చే చర్మసమస్యలు నివారించేందుకు మూడు రకాలు గా సౌందర్యఉత్పత్తులు దొరుకుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే అనారోగ్యానికి వాడే మందుల్లా ఇవి పెరిగే వయసు తెచ్చే మార్పులనుంచి చర్మాన్ని రక్షించేందుకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. చర్మానికి సంబంధించిన పలు సమస్యల కోసం దొరికే ఎన్నో సౌందర్యసాధనాలు మనకు తెలుసు. అయితే అన్ని సౌందర్య సాధనాలు అందరికీ ఒకే లా పనిచేయకపోవచ్చు. అందుకే చర్మ తీరుని, రంగుని బట్టి వాడేందుకు వివిధ క్రీములు లోషన్ల ను ఆయా ఉత్పత్తి దారులు తయారుచేసి వినియో గదారులను ఆకర్షిస్తున్నారు.ఇదే తరహాలో ఇపుడు మరొక ప్రత్యేక పద్ధతి లో సౌందర్య సాధనాలు తయారవుతున్నాయి.

వయసుల్లో తేడా లను బట్టి వచ్చే చర్మ మార్పులను ఇవి తగ్గించగ లుగుతాయి. ఒక రకంగా చెప్పాలంటే అనారోగ్యా నికి వాడే మందుల్లా ఇవి పెరిగే వయసు తెచ్చే మార్పుల నుంచి చర్మాన్ని రక్షించేందుకు ప్రత్యేకం గా రూపొందించబడినవి.30 ఏళ్ల లోపు మహిళల చర్మం సున్నితంగా ఉంటుంది.

30 ఏళ్లు దాటితే మొహంలో వయసుపెరుగుతున్న చిహ్నాలు కనబడు తుంటాయి. నిదానంగా ముడతలు ప్రారంభమవు తాయి. చర్మం తీరునిబట్టి ఇవి కొందరిలో మరింత ఎక్కువగా ఉంటాయి. ఇక 50సంవత్సరాలు వయ సు దాటితే చర్మంలో మతకణాలు, పిగ్మంటేషన్‌ మొదలైన సమస్యలు మొదలవుతాయి.ఇలా వివిధ వయసుల్లో వచ్చే చర్మ సమస్యలు నివారించేందుకు మూడురకాలుగా సౌందర్య ఉత్పత్తులు దొరుకుతు న్నాయి.

చర్మసంరక్షణ కోసం బ్యూటీపార్లర్ల వరకు వెళ్లేందుకు అనువైన పరిస్థితులు, సమయం లేని వారు వీటిని వాడవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఈ రకపు సౌందర్య ఉత్ప త్తులు తయారై మహిళల సౌందర్యానికి సరికొత్త మెరుగులు దిద్దుతున్నాయి. ఇటువంటి కంపెనీల్లో అమెరికాకు చెందిన ఎలిజి బెత్‌ ఆర్‌డన్‌ అనే కాస్మొటిక్‌ కంపెనీ కూడా ఒకటి. వీరి ఉత్పత్తులు మనదేశంలో లభిస్తున్నాయి. 30 సంవత్సరాల లోపు వారికోసం ఒక క్రీమ్‌, 30 ఏళ్లు దాటిన వారికోసం మరొక క్రీమ్‌, 50 ఏళ్లు దాటిన వారికోసం రకరకాల ఉత్పత్తులు మార్కెట్‌ లో దొరుకుతున్నాయి.వీటిధర సుమారు ఆరువంద ల నుంచి మూడువేల రూపాయల లోపు ధరల్లో లభ్యమవుతున్నాయి. మంచి ఆహార అలవాట్లతో పాటు దీనిని వాడటం వల్ల శరీరం తీరుగా ఉంటుందని ఈ క్రీమ్‌ ఉత్పత్తి దారులు అంటున్నారు.