వన్‌ప్లాస్‌ నుంచి సిరమిక్‌ స్మార్ట్‌ఫోన్‌

ONEPLUS
బెంగళూరు : అంతర్జాతీయ బహుళజాతి కంపెనీలనుంచి వచ్చిన వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ తాజాగా వన్‌ప్లస్‌ ఎక్స్‌ సిరమిక్‌ వేరియంట్‌ను విడుదల చేసింది. ఫ్రెంచ్‌ కనెక్షన్‌ స్టోర్లలో శుక్రవారం విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. భారత్‌లోని ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌లలోని ఫ్రెంచ్‌ కనెక్షనక్ష స్టోర్లలో ఈఫోన్లు అందుబాటులోనికి వస్తాయి. కేవలం రెండుగంటలపాటు మాత్రమే ప్రత్యేక సేల్‌ ప్రకటించిన కంపెనీ మొదటి 50 కొను గోలుదారులకు ప్రతి నగరంలోను పదిశాతం డిస్కౌంట్‌ ఉంటుందని ప్రకటించింది. ఈ విక్ర యాలు శుక్రవారం ఏడు గంటలనుంచి జనవరి ఎనిమిదవ తేదీవరకూ కొనసాగుతాయని వన్‌ ప్లస్‌ వెల్లడించింది. వన్‌ప్లస్‌ ఇండియా హెడ్‌ కరణ్‌ సారిన్‌ మాట్లాడుతూ మంచి మార్కెట్‌ సాధించగలమన్నారు. ఢిల్లీలోని సాకేత్‌వద్ద ఉన్న సిటీ వాక్‌మాల్‌, ముంబైలోని పల్లాడియం మాల్‌, హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఫోరమ్‌ మాల్స్‌లో వీటిని విక్రయిస్తారు. కొత్త స్మార్ట్‌ ఫోన్‌ వన్‌ప్లస్‌ ఎక్స్‌ సిరమిక్‌ ధరలు రూ.22,999లుగా ప్రకటించింది. 1972లోఫ్రెంచ్‌ కనెక్షన్‌ను స్టీపెన్‌ మార్క్స్‌ స్థాపించారు. బ్రిటిష్‌ఫ్యాషన్‌ బ్రాండ్‌గా ఉన్న ఈకనెక్షన్‌ 25 దేశాల్లో 1500కుపైగా ఔట్‌లెట్లను నిర్వహిస్తోంది.