వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌కు నేను రెడీ!

vijaymalya
vijaymalya

వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌కు నేను రెడీ!

న్యూఢిల్లీ: కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌పరంగా తీసుకున్న బకాయిలు రూ.9000కోట్లను వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌గా పరిష్కరించుకునేందుకు తాను సిద్ధమేనని విజ§్‌ుమాల్యా బ్యాంకర్లకు మరో సంకే తం పంపించారు. ట్విట్టర్‌ వేదికగా ఆయన తన సంసిద్ధతను వ్యక్తంచేసారు. ప్రభుత్వరంగ బ్యాంకు లు వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ విధానాలు అమలుచేస్తు న్నాయి. వందలాదిమంది రుణాలుతీసుకున్న వ్యక్తు లు వీటిని ఈ దిశగానే పరిష్కరించుకున్నారు. మాకెందుకు ఈ విధానాన్ని తిరస్కరిస్తున్నారు. సుప్రీం కోర్టు ముందు తాము తగినంతగా ఆఫర్‌ ఉంచాము అయినా సరే బ్యాంకులు ఎలాంటి పరిశీలన లేకుండా తిరస్కరించాయి. సహేతు కమైన పద్ధతిలో తాను చర్చలు జరిపేందుకు సిద్ధమేనని మాల్యా తన ట్విట్టర్‌హ్యాండిల్‌లో వెల్లడించారు. సుప్రీంకోర్టు తన వ్యవహారం లో జోక్యంచేసుకుని ఈ వివాదానికి ఒక ముగింపు ఇస్తుందని భావిస్తున్నామని అన్నా రు.

బ్యాంకులకు తమతో సంప్రదించి పరిష్క రించుకునేదిశగా ఆదేశాలు జారీచేస్తుందనే దీమా వ్యక్తంచేసారు. అందుకు తాము సిద్ధ మేనని ఆయన అన్నారు. తాను ప్రతి కోర్టు ఉత్తర్వును వినమ్రంగా పాటించానని అందు లో ఎలాంటి మినహాయింపులు ఉండవని, సహేతుకమైన విచారణలేకుండాప్రభుత్వం తనను దోషిగా చిత్రిస్తున్నదని ఆయన విమర్శించా రు. అటార్నిజనరల్‌ తనపైచేసిన ఆరోపణలు తన పై ప్రభుత్వానికి ఉన్న అభిప్రాయాన్ని రుజువుచేస్తు న్నా యని అన్నారు.

అంతకుముందురోజే సుప్రీం కోర్టు మాల్యాతరపు కౌన్సెల్‌ను అన్ని ఆస్తులను నిజంగా నివేదించారా, 40మిలియన్‌ డాలర్లను తమ పిల్లలకు బదిలీచేసిన అంశాన్ని ఎందుకు దాచారని ప్రశ్నించిన సంగతితెలిసిందే. జస్టిస్‌ ఆదర్శ్‌కుమార్‌ గోయల్‌, యుయులలిత్‌లో ఉన్న బెంచ్‌ రోజు మొత్తం విచారణలో ఈ సందేహాలను వెల్లడించింది. బ్యాంకర్లనుంచి వచ్చిన రెండు అభ్య ర్ధలపైవాదన విన్న కోర్టు తన ఉత్తర్వులను రిజర్వు లో ఉంచింది.

బ్యాంకర్లు మాల్యాపై కోర్టుధిక్కారణ నేరం కింద విచారణజరిపి చర్యలు తీసుకోవాలని, అలాగే డియోజియో నుంచి వచ్చిన 40 మిలియన్‌ డాలర్లను వెంటనే డిపాజిట్‌చేసేవిధంగా ఆదేశాలు జారీచేయాలని రెండు పిటిషన్లను బ్యాంకర్ల కూట మి కోర్టుకు నివేదించింది. గతనెలలోనే భారత ప్రభుత్వం బ్రిటన్‌కు ఒకవిజ్ఞప్తిని పంపిస్తూ మాల్యా ను తమకు అప్పగించాలని, రుణబకాయిల కేసులు విచారణలు ఎదుర్కొంటున్నారని, ఇతర ఆర్థికపర మైన అవకతవకలకు పాల్పడినందున మాల్యాను తమ దేశానికి పంపించాలని కోరింది. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ మూసివేత కారణంగా మాల్యా రూ.9వేల కోట్లు వివిధ బ్యాంకులకు బకాయి పడ్డారు. గత ఏడాది మార్చిలోనే ఆయన దేశం వీడి ప్రస్తుతం బ్రిటన్‌లో తలదాచుకుంటున్నారు.