వనస్థలిపురంలో కారు ప్రమాదం… ఒకరు మృతి

CAR Accident
CAR Accident

హైదరాబాద్‌: మంగళవారం అర్ధరాత్రి నగర వనస్థలిపురం ఆటోనగర్‌లో రోడ్డుపక్కన పుట్‌పాత్‌ మీదున్న ఓ షాప్‌లోకి కారు దూసుకెళ్లడంతో భరత్‌(34) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. హయత్‌నగర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సంతోష్‌రెడ్డి, బీటెక్‌ విద్యార్థి రషిద్‌ ఇద్దరు అర్ధరాత్రి వనస్థలిపురం నుండి హయత్‌నగర్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారు నడిపిన యువకులు మద్యం మత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగుండొచ్చని పోలీసులు అనుమానిస్తునారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స ఇస్తున్నారు. గాయపడిన ఇద్దరిని రాజస్థాన్‌కు చెందినవారుగా గుర్తించారు.