వనరులు అనుకూలిస్తే 5జి అమలు సాధ్యమే

5g
5G

వనరులు అనుకూలిస్తే 5జి అమలు సాధ్యమే

న్యూఢిల్లీ, మే 15: దేశవ్యాప్తంగా 4జి శకం నడుస్తున్న టెలికాం రంగంలో మరింత వేగవంతమైన సేవలు అందించేందుకు నెట్‌ వర్క్‌సిద్ధం అవుతోంది. 5జి నెట్‌వర్క్‌ను అమలుచేసేందుకు మొత్తం యంత్రాంగం 2018 నాటికి పూర్తిస్థాయిలో సిద్ధం అవు తుందనివెల్లడించారు. 5జిని ప్రారంభించేందుకు అనువైన మౌలిక వనరులులన్నీ ఉన్నాయని సాధ్యమైనంత వరకూ 2018లోనే ప్రారంభిస్తామని మంత్రిత్వశాఖ వెల్లడించారు.

5జి అమలుతో భారత్‌లో చెప్పుకోదగిన ఆర్థిక, రాజకీయ పర్యావరణ పరంగా ప్రయోజనాలు ఉంటాయని ఇటిఎస్‌ఐ చీఫ్‌ టెక్నికల్‌ అధికారి 3జిపిపి ఎంసిసి హెడ్‌ ఆడ్రియన్‌ స్కార్స్‌ వెల్లడించారు. సెల్యులర్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ ఎస్‌మాథ్యూస్‌ మాట్లాడుతూ వినియోగదారులనుంచి డిమాండ్‌ పెరిగితే వనరులు అందు బాటులోకి వచ్చి, వాణిజ్యపరంగాగిట్టుబాటుగా ఉంటే ఆపరేటర్లు 5జి అమలుకు సిద్ధంఅవుతారని అన్నా రు. జపాన్‌, దక్షిణకొరియాలాంటి దేశాల్లో 5జి అమలుసులువేనని, భారత్‌లో విభిన్న తరహాలో ఉం టుందని అన్నారు. ఆర్థికపరమని నిర్మాణాత్మక సవాళ్లు అనేకం ఎదుర్కొనాల్సి ఉంటుందని మాథ్యూస్‌ వెల్లడించారు.