వదన మృదుత్వం

                           వదన మృదుత్వం

CUTE
CUTE

వేసవి తాపం తీర్చడంలో పుచ్చకాయ ప్రాధాన్యత ఎంతో ఉంది. అందరూ ఇష్టపడే ఫలమిది. అలాంటి పుచ్చకాయ తినగా ఇంకా మిగిలిపోతే వృధాగా పారవేయడానికి ఇష్టంలేక బాధపడుతున్నారా. అయితే మీకో సలహా. పుచ్చకాయ ఆరోగ్యపరంగానే కాదు. అందానికీ మేలు చేస్తుంది. కాబట్టి పుచ్చకాయతో సౌందర్య సంరక్షణకు ఎలాగో తెలుసుకుందామా!
్య సన్నగా కోసిన పుచ్చకాయ ముక్కతో ముఖమంతా బాగా రుద్దుకోవాలి. పదిహేను నిమిషాల తరువాత నీటితో కడిగేసుకుంటే చాలు. చర్మానికి చల్లదనం అంది తాజాదనాన్ని సంతరించుకుంటుంది.
్య స్నానం చేయడానికి ఇరవై నిమిషాల ముందు పుచ్చకాయ, కీరదోస గుజ్జులను సమపాళ్లలో కలిపి ముఖం, మెడభాగాల్లో రాసుకోవాలి. ఆ తరువాత దూదితో తుడిచేసుకోవాలి. ఎండ తీవ్రతకు కమిలిన చర్మాన్ని కాంతివంతంగా మార్చే ప్యాక్‌ ఇది.
్య గుప్పెడు పుదీనా ఆకులను మెత్తగా నూరి పుచ్చకాయ రసంలో కలపాలి. దీనిని ఐస్‌ట్రేలో నింపి డీప్‌ఫ్రిజ్‌లో ఉంచాలి. ఈ ఐసుముక్కతో ముఖాన్ని రుద్దు కుంటే…చర్మం తాజాగా మారడంతో పాటు స్వేదగ్రంధులు తెరచుకుంటాయి.
్య నాలుగైదు బాదం పలుకులను పాలల్లో నానబెట్టి మెత్తగా నూరాలి. దీనికి పావ్ఞకప్పుడు పుచ్చకాయ గుజ్జు చేర్చి ముఖానికి రాసుకొంటే చక్కని స్క్రబ్‌లా పనిచేస్తుది. బాదం పలుకుల బదులు శనగపిండిని చేర్చవచ్చు.
్య కప్పు పుచ్చకాయ రసానికి నిమ్మరసం చేర్చి ఇరవై నిమి షాలు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇది చక్కని టోనర్‌. దీంతో ముఖాన్ని శుభ్రపరచుకొంటే తాజాదనం సంతరించు కోవడంతో పాటు మృదువ్ఞగా మారుతుంది.