వదంతులను నమ్మకండి… నేను ఆడుతున్నాను: కోహ్లీ

 

kohli
VIRAT KOHLI

 

క్యాండీ: శ్రీలంకతో పరిమిత ఓవర్ల క్రికెట్‌ సిరీస్‌ ఆడేందుకు తనకు సమ్మతమేనని, ఇబ్బందేమి లేదని టీమిండియా
కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ స్పష్టం చేశారు. మున్ముందు వరుస సిరీస్‌లు ఉండటంతో ఈ సారి మాత్రం విశ్రాంతి
ఇస్తారన్న ఊహాగానాలపై అతను స్పందించారు. నేను ఆడటం లేదని ఎవరన్నారు? ఈ వార్త ఎక్కడినుంచో
దావానలంలా వచ్చిందో నాకు తెలియదు. ఆడటానికి ఇబ్బందేమి లేదు. కెప్టెన్‌గా కమిటీతో ఎమి చెప్పాలో తెలుసు
అని కోహ్లీ అన్నారు. త్వరలోనే టీమ్‌ మేనేజ్‌మెంట్‌, సెలక్టర్లు సమావేశమై జట్టు ఎంపిక గురించి చర్చిస్తారు.
ఆటగాళ్ల కాంబినేషన్‌పై మాకు ప్రణాళికలు ఉన్నాయి. ఆగస్టు 13న బీసీసీఐ వన్డే జట్టును ప్రకటించనుంది.
స్పిన్నర్లు రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, పేసర్‌ మహ్మద్‌ షమికి విశ్రాంతి కల్పించే అవకాశాలునానయి.