వచ్చే నెల 8కి వాయిదా

Rahul-Gandhi-and-Sonia-Gandhi
నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో విచారణలు
వచ్చే నెల 8కి వాయిదా
హైదరాబాద్‌ : నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికకు సంబంధించిన ఆస్తులను అక్రమంగా మళ్లించారన్న కేసులో విచారణలు జరుగుతున్నాయి. ఢిల్లీ పాటియాల హౌస్‌ కోర్టులో విచారణలు జరిగాయి. ఆ కేసులో సోనియా గాంధీ, రాహూల్‌గాంధీల బృందం బెయిల్‌ పొందారు. కాగా విచారణలకు హాజరు కావలసి ఉంది. అదే క్రమంలో సోనియా, రాహూల్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించి తమపై ఉన్న అభియోగాలను రద్దు చేయాలని కోరారు. ఇప్పటికే వారు ఆ కేసు విషయంలో కోర్టుకు హాజరయిన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా పరిగణించారు. ఆ కేసులో ప్రత్యక్ష హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరినా ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. ఆ కేసు నుంచి బయటపడాలన్న సంకల్పంతో  కాంగ్రెస్‌ నాయకులు న్యాయపోరాటం ప్రారంభించారు. అందులో భాగంగా సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అం దులో అభియోగాలన్ని రద్దు చేయాలని కోరినప్పటికి చివరకు ప్రత్యక్ష హాజరునుంచి మినహాయింపు పోందే అవకాశం ఉంది. సుప్రీం కోర్టు స్పెషల్‌లీవ్‌ పిటిషన్‌పై ఇంకా విచారణలు జరుపుతోంది. అయితే పాటియాల హౌస్‌ కోర్టులో సాధారణ విచారణలు జరుగుతున్నాయి. బెయిల్‌ పొందినప్పటికి నిందితులు కోర్టు విచారణలకు హాజరు కావలసిందే. ఆ మేరకు మరోమారు సోనియా, రాహూల్‌లు కోర్టు విచారణకు హాజరవుతారా? ఈ లోపు సుప్రీం కోర్టు వాని ప్రత్యక్ష హజరుకు మినహాయింపు ఇస్తుందా అన్న విషయాలపై ఆసిక్తకర చర్చ సాగుతోంది. దేశవ్యాప్తంగా చర్చనీయయాంశమైన ఆ కేసులో సోనియా బృందం తరపున కపిల్‌ సిబాల్‌ వాదనలు విన్పిస్తున్నారు. ఆ కేసు పూర్తిగా అధికార పార్టీ కుట్ర అని సోనియా గాంధీ గతంలో కోర్టు వద్దే ప్రకటించారు. అదే విషయంలో తాము చట్టాన్ని అనుసరిస్తామని ఇలాంటి కుట్రలకు భయపడేది లేదని రాహూల్‌ గాంధీ హెచ్చరించడం తెలిసిందే. జవహర్‌ లాల్‌ నెహ్రూ స్థాపించిన నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికకు సంబంధించిన రూ.50 వేల కోట్ల విలువైన ఆస్తులను అతి తక్కువ ధరకు ఇతర సంస్థలకు మళ్లించారన్నది ప్రధాన అభియోగం.

ఆస్తులు మళ్లించిన సంస్థలు కూడా రాహూల్‌ గాంధీకి చెందనవేనని అభియోగం. రూ. 50 వేల కోట్లను భారత్‌ నుంచి ఇతర ప్రాంతాలకు తరలించేందుకు పెద్ద ఎత్తున మనీ లాండరింగ్‌ జరిగిందని కోర్టులో ఫిర్యాదు చేశారు. ఆ కేసులో సోనియా గాంధీ, రాహూల్‌ గాంధీలతో పాటు సుమన్‌ దూబే, మోతీలాల్‌ వోరా, అస్కార్‌ ఫెర్నాండెజ్‌, శామ్‌పిత్రోడాలను నిందితులుగా చేర్చారు. అయితే ఆ కేసు విచారణ ప్రారంభమయ్యాక పిటిషనర్‌ బిజెపి నేత సుభ్రమణ్య స్వామికి ప్రత్యేక భద్రత కల్పించారు.