వచ్చే నెల కడపలో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన

cm ramesh
cm ramesh

కడప: డిసెంబరు 27న కడపలో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన జరగనుందని టిడిపి ఎంపి సియం రమేష్‌ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..కడప జిల్లా మైలవరం మండలం కంబాల దిన్నెలో ఉక్కు కర్మాగారం నిర్మాణం జరుగుతుందన్నారు. ఏపిఎండిసి, ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్లాంట్‌ చేయడం జరుగుతుందని సియం రమేష్‌ పేర్కొన్నారు. సుజనాచౌదరి విషయంలో ఈడి కొత్తగా చెప్పిందేమీలేదని, ఇన్నాళ్లు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. సుజనా కూడా న్యాయపోరాటం చేస్తారని రమేష్‌ అన్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మోది దాడులు చేస్తున్నారని అన్నారు.