వచ్చే ఎన్నికల నాటికి యుపిలో కాంగ్రెస్‌దే కొత్తప్రభుత్వం

congress
congress

ప్రియాక,సింధియాలకు లక్ష్యంనిర్దేశించిన రాహుల్‌
అమేథి: వచ్చే ఎన్నికలనాటికి ఉత్తరప్రదేశ్‌లో కొత్తప్రభుత్వం ఏర్పాటుకావాలని అది కాంగ్రెస్‌ప్రభుత్వమే రావాలని ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కొత్త ఇన్‌ఛార్జిలు ప్రియాంకగాంధీ, జ్యోతిరాదిత్యసిందియాలకు లక్ష్యం నిర్దేశించారు. ప్రియాంకగాంధీ వాద్రా యుపికి సంబంధించి స్పష్టమైన లక్ష్యంతో ఉన్నారని, రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలనాటికి కాంగ్రెస్‌ప్రభుత్వం ఏర్పాటుకు కృషిచేస్తారని విశ్వాసం వ్యక్తంచేసారు. ఉత్తరప్రదేశఖకోసం వీరిద్దరిని ఎఐసిసి ప్రధాన కార్యదర్శులుగా నియమించానని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోనికి రావాలన్న లక్ష్యంతోనే చేసినట్లు వివరించారు. రాహుల్‌ శివాలయాన్ని సందర్శించి అనంతరం ఒక పాఠశాలనుసైతం చూసారు. తన రెండురోజుల పర్యటనను తన అమేథి లోక్‌సభ నియోజకవర్గంలోముగిస్తూ అక్కడిప్రజలకు హామీలిచ్చారు. ప్రియాక ఇకపై నియోజకవర్గంలోపర్యటిస్తారని, ప్రధాన కార్యదర్శిహోదాలోనే అన్ని వ్యవహారాలుచూస్తారని హామీ ఇచ్చారు. ఎస్‌పి బిఎస్‌పి కూటమితో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సంక్లిష్టసమస్యే ఎదురవుతున్న భావన వ్యక్తం అవుతున్నతరుణంలో రాహుల్‌చేసిన నియామకాలతో పార్టీ పూర్తిస్థాయి మెజార్టీతో వస్తుందని భావిస్తున్నారు. ములాయంసింగ్‌జీ,మాయావతిజీ, అఖిలేస్‌యాదవ్‌జీలనుతాను ఎంతోగౌరవిస్తానని, కాంగ్రెస్‌ పార్టీ కూడా తనవంతు వాటాగా కృషిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మేం కొత్తప్రభుత్వం ఏర్పాటుచేస్తామని, లోక్‌సభలో కూడా మొత్తం సత్తాను ఉపయోగిస్తామని, వెనకడుగు వేసే ప్రసక్తేలేదని అన్నారు.రాహుల్‌ గాంధీ ఈసందర్భంగా ఫుడ్‌పార్కు, పేర్‌మిల్లు ఇతర ప్రాజెక్టులను వృద్ధిచేస్తామని అన్నారు. ఎన్‌డిఎప్రభుత్వాన్నే లక్ష్యంగాచేసుకని పనిచేస్తామన్నారు. అమేథి, రా§్‌ుబరేలిల్లో కూడా ఎన్నికల ప్రచారం ప్రారంబిస్తామని, కేంద్రం కావాలనే ఈ రెండు నియోజకవర్గాల్లో అభివృద్ధిని నిలిపివేసిందని అన్నారు. అమేథికి ఫుడ్‌పార్కు మళ్లీ వస్తుందని, ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్యమంత్రియోగి ఆదిత్యనాధ్‌ తిరస్కరించినవన్నీ మేం తెస్తామని హామీ ఇచ్చారు. ఛత్తీస్‌ఘర్‌,మధ్యప్రదేశ్‌లలో కాంగ్రెస్‌ప్రభుత్వాలు రైతులసంక్షేమానికి పనిచేస్తునఆనయని గుర్తుచేసారు. రుణమాఫీతోపాటు కాంగ్రెసప్రభుత్వాలు ఆహారశుద్ధికేంద్రాలను ప్రారంభించారని గుర్తుచేసారు.అదేతరమాలోయుపనిలోకూడా ఉంటాయన్నారు. మరో రోడ్డుసైడు ర్యాలీలో రాహుల్‌ వర్తకుల, వ్యాపారుల సమస్యలపై మాట్లాడారు. జిఎస్‌టి ఒక గబ్బర్‌సింగ్‌ పన్ను వంటిదని విమర్శించారు. బిజెపిని ఓడించేందుకు కాంగ్రెస్‌కేడర్‌మొత్తం సమాయత్తం కావాలని, బిజెపి ముక్తభారత్‌వైపు సమగ్ర కృషి, సమిష్టిపోరు చేయాలని కాంగ్రెస్‌ కేడర్‌ ఈదిశగా సమాయత్తం కావాలని రాహుల్‌ పిలుపునిచ్చారు.