వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం: టిపిసిసి చీఫ్‌

UTTAM KUMAR REDDY
Uttam Kumar reddy

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై మరోమారు టిపిసిసి చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. తెలంగాణ కెసిఆర్‌ కుటుంబం దోపిడీకి పాల్పడుతోందని మండిపడ్డారు. మరోవైపు మంత్రి కెటిఆర్‌ సూటు బూటుతోనే కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. దావోస్‌ సదస్సుకు ఎవరు దరఖాస్తు చేసుకున్నా ఆహ్వానిస్తారని, అలా రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించే కెటిఆర్‌ దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. మేం చెప్పింది నిజమో..కాదో కెటిఆర్‌ చెప్పాలన్నారు. కెటిఆర్‌ బూటకపు ప్రచారాలు తప్ప పెట్టుబడులు  మాత్రం శూన్యం అని ధ్వజమెత్తారు. వారణాసి, ఏపి, కర్ణాటకలో బిఆర్‌ శెట్టి పెట్టుబడులు ప్రకటించినా, ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదని చెప్పుకొచ్చారు. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్‌దే అధికారమని ఉత్తమ్‌ కుమార్‌ ధీమా వ్యక్తం చేశారు.