వచ్చే ఎన్నికలలో ఎంపీగా పోటీ

KATTI MAHESH
KATTI MAHESH

Omgole:   వివాదాల ద్వారా ప్రాచుర్యం పొందిన సినీ విమర్శకుడు కత్తి మహేష్ వచ్చే ఎన్నికలలో ఎంపీగా పోటీ చేయనున్నాడట. అది కూడా ఏ పార్టీనుండి కాకుండా స్వతంత్రంగా పోటీచేయనున్నాడని చెప్పారు. తనకు నచ్చిన పార్టీకి మద్దతు ఇస్తానన్న మహేష్ పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేశారు. ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న మహేష్ నూతన దళిత నాయకత్వం కోసమే జిల్లాల పర్యటన చేస్తున్నానని చెప్పారు. ప్రస్తుత రాజకీయ పార్టీలన్నీ దళితజాతికి అన్యాయం చేస్తున్నాయన్న మహేష్ రాజకీయాలలో నేతలు పరిణితి చెంది ఉండాలన్నారు.