వచ్చేలోక్‌సభలో ఓటమి తప్పదని బిజెపికి తెలుసు!

rahul gandhi
rahul gandhi

మిజోరమ్‌ ఎన్నికల సభల్లో ఎఐసిసి అద్యక్షుడు రాహుల్‌ గాంధీ
చంఫా§్‌ు: దేశంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలవలేమని బిజెపి ఆర్‌ఎస్‌ఎస్‌లకు స్పష్టంగా తెలిసిపోయిందని ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికలకు వస్తున్న మిజోరమ్‌లోని చంపా§్‌ులో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్‌ గాంధీ పాల్గొనిప్రసంగించారు. బిజెపి ఆర్‌ఎస్‌ఎస్‌లు రాష్ట్రంలోని సంస్కృతిని దెబ్బతీసాయని ఆరోపించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మిజోరమ్‌ ఎన్నికలర్యాలీల్లో విస్తృతంగా పాల్గొన్నారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌రెండూ కూడా రాష్ట్రంసంస్కృతి సాంప్రదాయాలకు విఘాతం కలిగిస్తున్నాయన్నారు. ఈ రెండింటికి ఇదే తమకు చివరి అవకాశమని మిజోరమ్‌లో ప్రవేశించాలన్నా, ఇక్కడి సంస్కృతిని దెబ్బతీయాలన్నా ఇదే మంచి తరుణమని కుట్రలుచేస్తున్నాయని అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలవలేమన్న సంగతి సైతం వారికి స్పష్టంగా తెలుసని ఎద్దేవాచేసారు. మిజోరమ్‌లోని 40 మంది సభ్యులున్న అసెంబ్లీకి ఈనెల 28వ తేదీ ఎన్నికలు జరగనున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో మిజోరమ్‌ ఒక్కటే కాంగ్రెస్‌ పార్టీ పాలనలో ఉన్న ఏకైక రాష్ట్రంగా నిలిచింది. రాష్ట్రంలోని మిజోనేషనల్‌ఫ్రంట్‌ బిజెపికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోమిత్రపక్షంగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలను దెబ్బతీసేందుకు కుట్రలుచేస్తున్న బిజెపితో ఎంఎన్‌ఎఫ్‌ వంటి పార్టీ చేతులు కలపడం దురదృష్టకరమని రాహుల్‌ పేర్కొన్నారు. మిజోరమ్‌ సంస్కృతి, భాష, వారసత్వ చరిత్రలను బిజెపి దెబ్బతీస్తోందని అన్నారు. బిజెపి విభజన కుట్రలను కేవలం కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే తిప్పికొడుతుందని అన్నారు. నరేంద్రమోడీ వ్యక్తిగతంగా రాఫెల్‌ డీల్‌అప్పగించి పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానికి రూ.30వేల కోట్లు లబ్దిచేకూర్చారని, ఈ మొత్తం దేశవ్యాప్తంగా ఎంఎన్‌రేగా పథకం ఒక ఏడాదికి చేసే ఖర్చుతో సమానమని అన్నారు. రిలయన్స్‌గ్రూప ఈఆరోపణలను ఖండించింది. లాల్‌తన్హవాలా ఆధ్వర్యంలోని మిజోరమ్‌లో పదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో ఎంతో అభివృదిధని సాధించిందని అన్నారు. రాష్ట్ర ఆర్ధికవ్యవస్థ ప్రగతిపథంలో ఉందని, తలసరి ఆదాయం రెట్టింపు అయిందని అన్నారు. మిజోరమ్‌ను ఈశాన్యభారత్‌ గేట్‌వేగా మారుస్తామని, 11వేల మందికి కొత్త కొలువులు సృష్టిస్తామని చెప్పారు. తన తండ్రి మాజీ ప్రధాని రాహుల్‌గాంధీతో కలిసి 1987లో ఈరాష్ట్రాన్ని సందర్శించిన గతాన్ని గుర్తుచేసుకున్నారు. 1987లో తన తండ్రి మిజోరమ్‌ వీదుల్లో తిరిగారని, తాను తండ్రితోపాటే వచ్చానని, ఎన్నికల తర్వాతసైతం తాను ఈ రాష్ట్రానికి ఎంతోకొంత చేయాలని నిర్ణయించానని, అందువల్లనే మిజోరమ్‌కు వచ్చి ప్రజలనునేరుగా కలుసుకుంటున్నట్లు వెల్లడించారు.