వచ్చేనెల్లో పాటల చిత్రీకరణ

Mahesh babu
Mahesh babu

వచ్చేనెల్లో పాటల చిత్రీకరణ

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న కొత్తసినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది.. సౌతిండియన్‌ టాప్‌ డైరెక్టర్లలో ఒకరైన ఎఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ఓ కీలక షెడ్యూల్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో జరుగుతోంది.. ఇక ఈ షెడ్యూల్‌ పూర్తయిన వెంటనే పూణే, ముంబైల్లో కొన్ని రోజుల షూటింగ్‌ జరిపాక ఫిబ్రవరిలో పాటల చిత్రీకరణ జరుపుతారట..
పాటల చిత్రీకరణ విదేశాల్లో జరపాలని ముందే నిర్ణయించిన టీం ఇపుడుఅ ందుకు సరైన లొకేషన్స్‌ ఎంపిక చేస్తోంది.. ఎన్‌వి ప్రసాద్‌, ఠాగూర్‌ మధు భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలన్నీ తారస్థాయిలో ఉన్నాయి.. మహేష్‌ సరసన రకుల్‌ ప్రీత్‌సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఎస్‌జె సూర్య విలన్‌గా నటిస్తున్నారు.. మహేష్‌ ఈసినిమాలో ఇంటిలిజెన్స్‌ ఆఫీసర్‌గా కన్పించనున్నారని తెలుస్తోంది. ఈ నెలాఖరులో ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ విడుదల కానున్నాయి.