వంశధారపై ట్రిబ్యునల్ తీర్పు శుభపరిణామంః చంద్రబాబు

అమరావతి: వంశధారపై ఆంధ్రప్రదేశ్ కు అనుకూలంగా ట్రిబ్యునల్ తీర్పు రావడం శుభ పరిణామమని ముఖ్యమంత్రి
చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. నేరడిబ్యారేజీ నిర్మాణానికి లైన్ క్లియర్ అయిందని దీంతో 50 టీఎంసీల నీరు అదనంగా
వాడుకునే అవకాశం ఉందన్నారు. 5 లక్షల ఎకరాలను స్థిరీకరించే అవకాశం రావడంతో కోస్తా జిల్లాల తరహాలోనే శ్రీకాకుళం
జిల్లా సస్యశ్యామలం అవుతుందని, నాగావళి-వంశధార అనుసంధానంతో ఇచ్ఛాపురం వరకు సాగునీరు అందుతోందని,
నేరడి బ్యారేజీకి అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించానని చంద్రబాబు తెలిపారు.