వందేమాతరంతో పాటు జనగణమన కూడా పాడుతాం

Kamalnath
Kamalnath  

 

భోపాల్‌: వందేమాతరం గీతం పాడే విషయంలో మధ్యప్రదేశ్‌లో వివాదం తలెత్తిన విషయం  తెలిసిందే. అయితే తాము వందేమాతరంతో పాటు జాతీయ గీతం జనగణమన కూడా పాడతామని మధ్యప్రదేశ్‌  సిఎం  కమల్‌నాథ్ వెల్లడించారు. ప్రతి నెల మొదటి పని దినం రోజున పోలీస్‌ బ్యాండ్‌తో శౌర్య సమర్కార్‌ నుంచి వల్లభ్ భవన్‌ వరకు నడిచి వచ్చి ఆ తర్వాత వందే మాతరం, జనగణమన పాడతామని వెల్లడించారు. ప్రజల్లో దేశభక్తి భావనను రేకెత్తించేందుకు పోలీస్‌ బ్యాండ్‌ను కూడా ఏర్పాటు చేస్తామని కమల్‌ నాథ్ స్పష్టం చేశారు.