వంటలో ఉండాల్సిన అంశాలు…

COOKING2
COOKING

వంటలో ఉండాల్సిన అంశాలు…

 

 

వంట చేసే ముందు, ఒక్క నివిుషం ఆగండి. ఆలోచించండి. వంటలోకి వాడుతున్న పదార్థాలు, వాటిలోని పోషకవిలువలు గుర్తించండి. మనం రోజూ తినే ఆహారంలో ఎలాంటి పదార్థాలు చోటు చేసుకోవాలంటే ఆకుకూరలు, గుడ్డు, పాలు, బ్రెడ్‌, మొలకలు, తాజాపళ్లు, రసాలు, పాలు, పెరుగు వంటివి ఉండాలి. ఆలివ్‌ ఆయిల్‌, ఆవనూనెల వాడకం మంచిది. సన్‌ఫ్లవర్‌ నూనెలో అధికమైన ఒమెగ-6 ఫాట్స్‌ ఉంటాయి. ఇది కీళ్లనొప్పులకు దారీతీయొచ్చు కూడా.

పెరుగులో మంచిచేసే బాక్టీరియా ఉంటుంది. ఇది రోగనిరోధకశక్తిని పెంచుతుంది. అలాగే ఆహారంలో తాజాఫలాలు, కూరలు ఉండాలి. ఎక్కువ చక్కెర వేయకండి. కాండీబార్స్‌,టీ, కాఫీలు, ఐస్‌క్రీమ్‌ కుకీలు స్వీట్స్‌ వంటి వంటలను ప్రోత్సహించకండి. ఇది డిప్రెషన్‌కి దారితీయొచ్చు. మితి మీరిన తీపిని అలవాటు కానీయకండి. మాదక ద్రవ్యాలలాగానే తీపి కూడా బానిసల్ని చేస్తుంది. అప్పుడు, ఊబకాయం, చక్కెర, కీళ్లనొప్పులు, వంటి బాధల బారిన పడాల్సి ఉంటుంది. చెడు చేసే కొలె స్ట్రాల్‌ని పెంచినవారు కావొద్దు. కండరాల పెంపు దలకు ప్రొటీన్స్‌ చాలా మంచిదే కానీ, అలా అని ఎక్కువ ప్రొటీన్స్‌ గల పదార్థాలు ఆహారంలో చోటు చేసుకుంటే దీర్ఘకాలంలో సైడ్‌ఎఫెక్ట్స్‌కి దారితీయొచ్చు. కిడ్నీలపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి.