ల‌క్ష ఎక‌రాల‌కు సాగునీరు

Jurala Project
Jurala Dam

గద్వాల కేంద్రంగా సోమ‌వారం జరిగిన సాగునీటి సలహా బోర్డు సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలో ఆయకట్టుకు నీరు విడుదల అంశంపై చర్చించారు. ఆయా ప్రాజెక్టుల కింద ఆరుతడి పంటలకు నీటి విడుదలపై బోర్డు నిర్ణయం తీసుకుంది. అలాగే, జూరాల ప్రాజెక్టు ఆయకట్టుకు లక్ష ఎకరాలకు నీరు ఇవ్వాలని సాగునీటి సలహా బోర్డు సమావేశం పేర్కొంది. ఆర్జీఎస్‌కు 25వేల ఎకరాల ఆయకట్టుకు నీరు, నెట్టెంపాడు కింద చెరువులు నింపడం ద్వారా 1.25 లక్షల ఎకరాలకు, కోయిల్‌సాగర్‌ కింద 30 వల ఎకరాలకు, భీమ ప్రాజెక్టు కింద 1.70 లక్షల ఎకరాలకు నీరివ్వాలన సాగునీటి సలహా బోర్డు కమిటీ నిర్ణయించింది.