లక్ష్యణ్ బాపూజీ ఆశయ సాధన దిశగా తమ ప్రభుత్వం ముందుకెళ్తుందిః ఈటల

హైదరాబాద్: బుధవారం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 102వ జయంతి సభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ అణగారిన వర్గాల అభివృద్ధే కొండా లక్ష్మణ్ బాపూజీకి ఇచ్చే నిజమైన నివాళి అని, ఆయన ఆశయ సాధన దిశగా తమ ప్రభుత్వం ముందుకు వెళుతోందని అన్నారు. జలదృశ్యంలో కొండా లక్ష్మణ్ మలిదశ ఉద్యమానికి బీజం వేశారని కొనియాడారు.