లోయా కేసులో సుప్రీం చివ‌రి తీర్పు

Justice Loya
Justice Loya

న్యూఢిల్లీః సీబీఐ జడ్జి బీహెచ్ లోయా మృతిపై దాఖలైన అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టు ఇవాళ కొట్టివేసింది. జడ్జి లోయాది సహజ మరణమని, ఆయన మరణంపై వ్యక్తిగత విచారణ మళ్లీ అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఆ బెంచ్‌లో జస్టిస్ ఏఎం ఖాన్‌విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లు ఉన్నారు. లోయా మృతిపై విచారణ చేపట్టాలని దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేస్తున్నామని, ఇదే సుప్రీం చివరి తీర్పు అని కోర్టు పేర్కొన్నది. కోర్టును త‌ప్పుదోవ ప‌ట్టించేందుకు ప‌లువురు పిటిష‌న్లు వేస్తున్నారు. 2005లో జరిగిన సోహ్రాబుద్దిన్ షేక్ ఎన్‌కౌంటర్ కేసును జడ్జి లోయా డీల్ చేశారు. ఆ కేసులో ఒకప్పుడు బీజేపీ చీఫ్ అమిత్ షా నిందితునిగా ఉన్నారు. అయితే జడ్జి లోయా మృతి తర్వాత ఆ కేసును మరో జడ్జి విచారించారు. ఆయన షాకు ఆ కేసు నుంచి విముక్తి కల్పించారు. జడ్జి లోయా మృతిపై దాఖలైన పిటిషన్లు అన్నీ మోసపూరితమైనవని కోర్టు తెలిపింది.