లోక్‌స‌భ సోమ‌వారానికి వాయిదా

Sumitra mahajan
Sumitra mahajan

న్యూఢిల్లీః వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన లోక్‌సభలో సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. దీంతో సభ సోమవారానికి వాయిదా పడింది. సేవ్ ఏపీ అంటూ ఏపీ ఎంపీలు సభలో నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. సభ్యుల ఆందోళన నడుమే సభను నడిపించేందుకు స్పీకర్ సుమిత్రామహాజన్ ప్రయత్నించారు. ప్రైవేటు నెంబర్ బిల్లు ఉన్నప్పటికీ సభ్యులు సభను జరగనీయకుండా అడ్డుకున్నారు. ప్రతీ శుక్రవారం మధ్యాహ్నం జరిగే ప్రైవేటు నెంబర్ బిల్లుకు ఎవరూ కూడా అంతరాయం కలిగించకూడదనే ఆనవాయితీ ఉంది. కాగా ఏపీకి న్యాయం చేయాలంటూ సభలో టీడీపీ, టీఆర్ఎస్, వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో ప్రైవేటు నెంబర్ బిల్లులు కూడా సజావుగా సాగే అవకాశం లేదనే నిర్ణయానికి వచ్చిన స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు.