లోక్‌స‌భ మాజీ స్పీక‌ర్ క‌న్నుమూత‌

Somnath Chatterjee
Somnath Chatterjee

కోల్‌క‌త్తాః లోక్‌సభ స్పీకర్‌ సోమనాథ్‌ ఛటర్జీ(89) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కోల్‌కతాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కొన్నాళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఛటర్జీ ఈనెల 7 నుంచి కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా నిన్న ఆయన గుండెపోటుకు గురయ్యారు. దీంతో వైద్యులు ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందజేశారు. ఛటర్జీ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఈరోజు ఉదయం కన్నుమూశారు.