లోక్‌సభ నుండి టిడిపి ఎంపీల సస్పెన్షన్‌

sumithra
sumithra

న్యూఢిల్లీ: ఈరోజు లోక్‌సభలో టిడిపి సభ్యులు ఏపికి న్యాయం చేయాలంటూ సభలో అందోళనకు దిగారు. అయితే వారు సభ కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారంటూ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ వారిని సస్పెండ్‌ చేశారు. ఎంపీలు గల్లా జయదేవ్‌, రామ్మోహన్‌ నాయుడు, తోట నరసింహం, మురళీమోహన్‌, బుట్టారేణుక, అవంతి శ్రీనివాస్‌, మాగంటి బాబు, జేసీ దివాకర్‌రెడ్డి, శ్రీరాం మాల్యాద్రి, అశోక్‌ గజపతిరాజు, కొనకళ్ల నారాయణలను నాలుగు రోజుల పాటు సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.