లోక్‌సభలో 17 స్థానాల్లో బిజెపి పోటీ

K. Laxman
K. Laxman

హైదరాబాద్‌: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ తెలంగాణలోని 17 లోక్‌సహ స్థానాల్లో బిజపి పోటీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.తెలంగాణలో అన్ని శాఖల్లో అవినీతి పెరిగిపోయిందని ఆయన ఆరోపించారు. తెలంగాణలో కేబినెట్ లేకపోవడంతో రాష్టంలో పాలన స్తంభించిపోయిందని విమర్శించారు. వందల కొద్దీ ఫైల్స్ పేరుకుపోతున్నాయన్నారు. కేంద్రం అమలు చేస్తోన్న ఫసల్ భీమా పథకం ప్రవేశపెట్టనందుకు తెలంగాణ ప్రభుత్వం రైతులకు సంజాయిషీ ఇచ్చుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారానికి బిజెపి సిద్ధమైందని ఆయన స్పష్టం చేశారు. ఫిబ్రవరిలోనే అన్ని రాష్ట్రాల్లో అమిత్ షా పర్యటనలు ఉంటాయని చెప్పారు. అలాగే మార్చిలో అన్ని రాష్ట్రాల్లో మోదీ పర్యటనలు ఉంటాయని వెల్లడించారు.