లోక్‌సభలో విపక్షాల నిరసనతో గందరగోళం

sumitra mahajan
sumitra mahajan

న్యూఢిల్లీ: లోక్‌సభలో విపక్షాలు ఆందోళన చేశాయి. ప్రత్యేక హోదా కోసం టిడిపి ఎంపీలు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ అస్సోం ఎన్నార్సీ అంశాలపై టిఎంసి సభ్యులు ఆందోళనకు దిగారు. ఏపికి ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ ప్లకార్డులతో టిడిపి ఎంపీలు నిరసన తెలిపారు. ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నంతసేపు ప్లకార్డులు ప్రదర్శించారు. ఏపికి హోదా ఇవ్వాలని కోరారు. సభ్యులంతా సహకరించాలని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ నచ్చజెప్పారు.