లోక్‌సభకు కెసిఆర్‌?

TS CM KCR1
TS CM KCR1

లోక్‌సభకు కెసిఆర్‌?

జాతీయ ఫ్రంట్‌ కోసం సన్నాహాలు
రిటైర్డ్‌ ఐఎఎస్‌లు, న్యాయనిపుణులు, రైతు సంఘాలతో వరుస భేటీలు
ఫ్రంట్‌ సమన్వయం కోసం సంతోష్‌కు రాజ్యసభ స్థానమా?..
కెటిఆర్‌కు సిఎం పోస్ట్‌?

హైదరాబాద్‌: దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడం కోసం జాతీయ స్థాయిలో రాజకీయ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తానని ప్రకటించిన టిఆర్‌ఎస్‌ అధినేత,ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన భవిష్యత్‌ ప్రణాళికను సిద్ధం చేసుకుం టున్నారు. దేశవ్యాప్తంగా వివిధ వర్గాలకు చెందిన సంఘాలు, సం స్థలు, ప్రముఖులతో వరుస సమావేశాలు నిర్వహించాలని కెసిఆర్‌ నిర్ణ యించారు.

మొదట ఐఏఎస్‌, ఐపిఎస్‌, ఐఆర్‌ఎస్‌ లాంటి ఆల్‌ ఇండి యా సర్వీస్‌ రిటైర్డ్‌ అధికారులతో సమావేశం కావాలని నిర్ణయించారు. జాతీయ స్థాయిలోనూ, వివిధ రాష్ట్రాల్లోనూ ఏళ్ల తరబడి ప్రభుత్వంలో పనిచేసిన అనుభవం, అనేక రాజకీయ పరిణామాలను చూసిన అను భవం ఉన్న ఆల్‌ ఇండియా సర్వీస్‌ అధికారులతో సమావేశం కావడం దేశానికి కావాల్సిన అజెండాను రూపొందించడానికి దోహదపడుతుం దని సిఎం కెసిఆర్‌ భావిస్తున్నారు. ఆల్‌ ఇండియా సర్వీస్‌ అధికా రులతో సమావేశం తర్వాత రిటైర్డ్‌రక్షణ శాఖ(సైనిక,వాయు, వైమానిక) అధికారులు,ఇతర ఉద్యోగులతో సమావేశం అవుతారు.

దేశవ్యాప్తంగా ఉన్న న్యాయనిపుణులు,ప్రముఖ న్యాయవాదులు, అఖిలభారత రైతు సం ఘాలు, వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న రైతుల సంఘాల ప్రతిని ధులతో సమావేశం అవుతారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసిన రిటైర్డ్‌ ఉద్యోగ సంఘాలతో, మీడియా సంస్థలు, జర్నలిస్టులు, పారిశ్రా మిక వేత్తలు, కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశం కావడానికి సిఎం సన్నాహాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతోనూ, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల్లోనూ పనిచేసిన ఆర్ధికశాఖ కార్యదర్శులు, అధికారులతోనూ కెసిఆర్‌ ప్రత్యేకంగా సమవేశమవుతారు. ఈ సమావేశాలు హైదరా బాద్‌, ఢిల్లీలో పాటు కలకత్తా, ముంబై, చెన్నై, బెంగుళూరు లాంటి నగరాల్లో కూడా నిర్వహించాలని సిఎం కెసిఆర్‌ నిర్ణయించారు. వివిధ వర్గాల ప్రతినిధులతో వరుస సమావేశాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.

ఆయావర్గాలను సంప్రదించడానికి, సమన్వయం చేయడానికి ప్రత్యేకంగా సమన్వయకర్తలను కూడా ముఖ్యమంత్రి నియమించారు. దేశం బాగుండాలని, దేశప్రజలు బాగుండాలని ఆలోచించే ప్రతి ఒక్కవర్గంతో మాట్లాడటం ద్వారా ఈ దేశానికి అవస రమైన అజెండాను రూపొందించవచ్చని సిఎం కెసిఆర్‌ భావిస్తున్నారు.