లోకేష్‌ సన్నబడ్డం కోసమే పాదయాత్ర చేస్తున్నాడంటూ మంత్రి రోజా ఎద్దేవా

minister-rk-roja-replies-to-tdp-leader-anitha-remarks

వైస్సార్సీపీ మంత్రి రోజా మరోసారి చంద్రబాబు , లోకేష్ లపై ఫైర్ అయ్యారు. లోకేష్‌ పాదయాత్రను ఆపాల్సిన పని తమకు లేదని , లోకేష్‌ సన్నబడ్డం కోసమే పాదయాత్ర చేస్తున్నారని రోజా ఎద్దేవా చేసారు. లోకేష్‌ పాదయాత్రకు టీడీపీ, ఆ పార్టీ నేతలే భయపడుతున్నారని సెటైర్లు వేశారు. లోకేష్ పాదయాత్ర పోస్టర్ విడుదల చేయగానే 11 మంది చనిపోయారని.. అందుకే ఈ పాదయాత్ర టీడీపీకే నష్టమని వ్యాఖ్యానించారు.

ఇక చంద్రబాబు తన పబ్లిసిటీ కోసం ఇరుకు రోడ్డుల్లో సభలు పెట్టి జనాన్ని చంపేస్తున్నారని ..పేదవాడి ప్రాణాలంటే చంద్రబాబుకు అంత చులకనా అని మంత్రి అన్నారు. గోదావరి పుష్కరాల్లో 29 మందిని చంద్రబాబు పొట్టన పెట్టుకున్నారని.. 40 ఏళ్ల ఇండస్ట్రీ అనే చంద్రబాబు 40 మందిని చంపారని ధ్వజమెత్తారు. ఇరుకు రోడ్లపై సభలు పెట్టి జనాలను చంపేస్తున్నారని.. 11 మంది బలయ్యారన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క మంచి పనైనా చేశారా అని రోజా ప్రశ్నించారు. చంద్రబాబు సభల వల్ల ఇంతమంది చనిపోతుంటే పవన్ కళ్యాణ్ స్పందించడం లేదని , పవన్ కళ్యాణ్ ప్యాకేజీకి తప్ప రాజకీయాలకు పనిచేయడని.. ఆయన నోటికి హెరిటేజ్‌ ప్లాస్టర్‌ వేసుకున్నాడా అని మంత్రి రోజా ధ్వజమెత్తారు.