లైన్‌మెన్ పోస్టుల భ‌ర్తీ ఆలోచ‌న‌లో ప్ర‌భుత్వం

CAREER
CAREER

అమ‌రావ‌తిః రాష్ట్రంలో 3,552 జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆలోచన చేస్తోందని విద్యుత్‌ శాఖ మంత్రి కళా వెంకటరావు వెల్లడించారు. లైన్‌మెన్‌ల కొరత తీవ్రంగా ఉందని సభాపతి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు ఈ సందర్భంగా సభ దృష్టికి తీసుకొచ్చారు. లైన్‌మెన్‌లు లేని కారణంగా కొందరు తాత్కాలిక మరమ్మత్తులకోసం పోల్స్‌ ఎక్కి చనిపోతున్నారని, ఇందులో రైతులు కూడా ఉంటున్నారని స్పీకర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.