లెప్టినెంట్‌ గవర్నర్‌ నివాసం ముందు ఆప్‌ ధర్నా

Arvind kejriwal
Arvind kejriwal

న్యూఢిల్లీ: సిసిటివి కెమేరాల వ్యవహారంలో ముఖ్యమంత్రి అరవింద్‌కేజ్రీవాల్‌, ఆయన సహచరులు లెప్టినెంట్‌ గవర్నర్‌ కార్యాలయం ముందు ధర్నానిర్వహించారు. ముఖ్యమంత్రి నివాసంనుంచి ర్యాలీగా బయలుదేరి సివిల్‌లైన్స్‌లో ఉన్న లెప్టినెంట్‌ గవర్నర్‌ కార్యాలయానికి వెళ్లి అక్కడ ధర్నా చేసారు. ఢిల్లీలెప్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌బైజాల్‌నివాసం ముందు ధర్నాచేసిన ముఖ్యమంత్రి మంత్రివర్గ సహచరులు సిసిటివి కేమేరాప్రాజెక్టు ఏర్పాటుకు మార్గదర్శకాలను రూపొందించేందుకు ఒక ప్యానెల్‌ను నియమించాలన్న గవర్నర్‌లేఖ వివాదాస్పదం అయింది. ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా, ప్రజాపనుల మంత్రి సత్యేందర్‌జైన్‌, రవాణా మంత్రి కైలాష్‌ గెహ్లట్‌, అనేకమంది ఆప్‌ ఎమ్మెల్యేలుసైతం ధర్నాలో పాల్గొన్నారు. మధ్యాహ్నం మూడు గంటలసమయంలో వీరంతా సివిల్‌లైన్స్‌కు ర్యాలీగా వచ్చారు. ఫ్లాగ్‌స్టాఫ్‌రోడ్‌లోని గవర్నర్‌నివాసం రాజ్‌నివాస్‌కుచేరుకుని ధర్నా నిర్వహించారు. ముందు గరవ్నర్‌ను కలవాలనినిర్ణయించారు. అయితే 32 నిమిషాలు గడిచాక కేజ్రీవాల్‌ రాజ్‌నివాస్‌కు వెళ్లే చిన్నరోడ్డుపైనే ధర్నాకు కూర్చున్నారు. గవర్నర్‌ కార్యాలయంనుంచికేవలం మంత్రులకు మాత్రమే గవర్నర్‌ను కలిసేందుకు అనుమతి ఉందన్న సమాచారం ఆప్‌ పార్టీ నేతలను కోపోద్రిక్తులనుచేసింది. ఎమ్మెల్యేలను కలుసుకోవడంలేదన్న లెప్టినెంట్‌ గవర్నర్‌ నిర్ణయం విడ్డూరంగా ఉందని కేజ్రీవాల్‌ ట్వీట్‌చేసారు. ముఖ్యమంత్రి కార్యాలయం వివరాలప్రకారం గవర్నర్‌ కార్యాలయం నుంచి వచ్చిన సమాచారం మేరకు కేవలం కేబినెట్‌తోమాత్రమే గవర్నర్‌ సమావేశం అవుతారని వచ్చింది. అయితేముఖ్యమంత్రి మాత్రం మొత్తం అందరు ఎమ్మెల్యేలను కలవాలని విజ్ఞప్తిచేసారు.మేమంతా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులమని అందరూ కలవాలని కోరారు. ఆప్‌ అధికారప్రతినిధి సౌరబ్‌ భరద్వాజ్‌ మాట్లాడుతూ ఇది ఢిల్లీప్రజలందరి సమస్య అని ఈ సమస్యను వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు. కేజ్రీవాల్‌గవర్నర్‌వైఖరిపై తీవ్ర నిరసన ప్రకటించారు.